Saturday, January 18, 2025
HomeసినిమాAkkineni Akhil: అఖిల్ నెక్ట్స్ మూవీ ఎప్పుడు..?

Akkineni Akhil: అఖిల్ నెక్ట్స్ మూవీ ఎప్పుడు..?

అక్కినేని అఖిల్ కి హీరోగా ఎంట్రీ ఇవ్వక ముందు నుంచి భారీగా క్రేజ్ వచ్చింది. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ సాధిస్తాడనుకుంటే.. అభిమానులకు నిరాశే ఎదురైంది. ఇంకా చెప్పాలంటే.. తొలి సక్సెస్ సాధించడానికి నాలుగవ సినిమా వరకు వెయిట్ చేయాల్సివచ్చింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాతో అఖిల్ సక్సెస్ సాధించాడు. ఆతర్వాత వచ్చిన ఏజెంట్ మూవీతో బ్లాక్ బస్టర్ సాధించాలి అనుకుంటే.. ఏమాత్రం అంచనాలు అందుకోలేకపోయింది.. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది. సమ్మర్ లో ఈ సినిమా రిలీజైంది.

ఆతర్వాత నుంచి అఖిల్ సైలెంట్ అయ్యాడు. నెక్ట్స్ మూవీ గురించి ఎలాంటి అప్ డేట్ లేదు. దీంతో అఖిల్ నెక్ట్స్ మూవీ అప్ డేట్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల తాత అక్కినేని 100వ జయంతి వేడుకలో అఖిల్ పాల్గొనడం.. చాలా యాక్టీవ్ గా కనిపించడం అభిమానులను ఆకట్టుకుంది కానీ.. కొత్త సినిమా కబురు మాత్రం చెప్పలేదు. మరి.. అఖిల్ నెక్ట్స్ ఎప్పుడు అంటే.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. యు.వీ క్రియేషన్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఈ చిత్రానికి నూతన దర్శకుడు అనిల్ దర్శకత్వం వహించనున్నాడు. ఇది భారీ సోషియో ఫాంటసీ మూవీ అని.. ఈ మూవీ టైటిల్ ధీర అని వార్తలు వస్తున్నాయి. ఈ భారీ క్రేజీ మూవీని జనవరి నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి.. ఈ సినిమాతో అయినా అఖిల్ అభిమానులు ఆశించినట్టుగా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్