Wednesday, March 18, 2026
HomeసినిమాAkkineni Fans: ఇక చైతు 'కస్టడీ' పైనే అభిమానుల ఆశలు

Akkineni Fans: ఇక చైతు ‘కస్టడీ’ పైనే అభిమానుల ఆశలు

అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న చిత్రం ‘ఏజెంట్’. అఖిల్ నటించిన మూవీ ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ చేశారు. తక్కువ టైమ్ లోనే బాగా ప్రమోషన్స్ చేశారు. అఖిల్ కు ఆశించిన బ్లాక్ బస్టర్ వస్తుందని నిర్మాత అనిల్ సుంకర గట్టిగా చెప్పడంతో అభిమానుల్లో మరింత నమ్మకం పెరిగింది. అయితే.. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే ఏజెంట్ మూవీ ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఫస్ట్ డే దాదాపు 8 కోట్లు గ్రాస్ వచ్చింది. రెండో రోజు నుంచే కలెక్షన్స్ బాగా తగ్గిపోయాయి. ఇది చిత్ర నిర్మాతకు అభిమానులకు షాక్ అని చెప్పచ్చు.

ఇప్పుడు అక్కినేని అభిమానుల ఆశలు అన్నీ’కస్టడీ’ మూవీ పైనే ఉన్నాయి. నాగచైతన్య నటించిన కస్టడీ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ్ లో కూడా రిలీజ్ చేస్తున్నారు. నాగచైతన్యకు జంటగా కృతి శెట్టి నటించింది. ప్రియమణి కీలక పాత్రలో నటిస్తే.. అరవింద్ స్వామి విలన్ పాత్ర పోషించారు. చైతన్య కెరీర్ లో భారీ తారాగణంతో.. భారీ బడ్జెట్ తో రూపొందిన చిత్రమిది. ఈ చిత్రానికి తండ్రీకొడుకులు ఇళయరాజా, యువన్ శంకర్ రాజా కలిసి సంగీతం అందించడం విశేషం.

ఈ చిత్రాన్ని మే 12న విడుదల చేయనున్నారు. తమిళ్ లో ఆల్రెడీ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. తెలుగులో ఇప్పుడు ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్నారు. ఈ మూవీ టీజర్ అండ్ సాంగ్స్ కు అనూహ్య స్పందన వచ్చింది. ఇందులో చైతన్య కానిస్టేబుల్ పాత్ర పోషించాడు. టీజర్ చూస్తుంటే.. ఇందులో కథాబలం ఉన్నట్టు అనిపిస్తుంది. అలాగే చైతన్య ఇప్పటి వరకు చేయని పాత్ర పోషించడంతో కస్టడీ మూవీ పై పాజిటివ్ టాక్ ఉంది. ఈ సినిమా పైనే ఇప్పుడు అక్కినేని అభిమానుల ఆశలన్నీ. మరి.. చైతన్య అయినా కస్టడీ మూవీతో విజయం సాధిస్తాడేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular