Saturday, January 18, 2025
Homeసినిమారామ్ డైరెక్టర్ తో నాగచైతన్య

రామ్ డైరెక్టర్ తో నాగచైతన్య

‘మజిలీ’, ‘వెంకీమామ’ చిత్రాల వరుస విజయంతో ఫుల్ జోష్ లో ఉన్నాడు అక్కినేని నాగచైతన్య. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ లో నటించాడు. సాయిపల్లవి ఈ సినిమాలో కథానాయిక పాత్ర పోషిస్తోంది. కరోనా కారణంగా వాయిదా పడింది కానీ.. లేకపోతే ఈపాటికే విడుదల అయ్యుండేది. తాజా సమాచారం ప్రకారం..ఆగష్టు లేదా సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిసింది. ఈ సినిమా తర్వాత శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తోన్న ‘థ్యాంక్యూ ‘లో నాగచైతన్య నటించాడు.  ఈ సినిమాకు ‘మనం’ ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మిస్తున్నారు. ఈ మూవీ దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఆగష్టులో ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారని సమాచారం.

ప్రస్తుతం నాగచైతన్య బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. అమీర్ ఖాన్ నటిస్తున్న హిందీ చిత్రం ‘లాల్‌సింగ్‌ ఛద్దా’ కోసం రంగంలోకి దిగుతున్నాడు. ఈ సినిమా తర్వాత నాగచైతన్య… నాగ్ క్రేజీ ప్రాజెక్ట్ ‘బంగార్రాజు’ పూర్తి చేయాల్సి ఉంది.  ఈ చిత్రాల తర్వాత ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒక్కటే జిందగీ’, ‘రెడ్’ ఇలా పోతినేని రామ్ తో మూడు సినిమాలు తెరకెక్కించిన కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో నాగచైతన్య ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పారని తెలిసింది. ఈ చిత్రాన్ని ఆర్ఆర్ఆర్ మూవీ ప్రొడ్యూసర్ డి.వి.వి. దానయ్య నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్