Thursday, March 19, 2026
Homeసినిమాఈ సారి నాగార్జునకి హిట్ తప్పదంటున్న ఫ్యాన్స్!

ఈ సారి నాగార్జునకి హిట్ తప్పదంటున్న ఫ్యాన్స్!

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు సీనియర్ స్టార్ హీరోలకు కొత్త ప్రాజెక్టులను సెట్ చేసుకోవడం కత్తిమీద సాములా మారింది. ఎందుకంటే ఇప్పుడున్న ట్రెండ్ ను అందుకోవాలంటే .. ఆ పల్స్ తెలిసిన యంగ్ డైరెక్టర్లతోనే సినిమాలు చేయాలి. వాళ్లు వినిపించే కొత్త కథలపై నమ్మకంతో ముందుకు వెళ్లవలసి ఉంటుంది. అయితే సీనియర్ స్టార్ హీరోలకు .. యువ దర్శకులకు మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ ఉంటూ ఉంటాయి. వాళ్లిద్దరూ కలిసి ముందుకు వెళ్లడం కొంత కష్టమైన పనే. అయినా సీనియర్ హీరోలు రిస్క్ తీసుకుంటున్నారు.

అలా ఒక కొత్త దర్శకుడితో నాగార్జున చేస్తున్న సినిమానే ‘నా సామిరంగ’. ప్రసన్న కుమార్ బెజవాడ అందించిన కథతో ఈ సినిమా రూపొందుతోంది. విజయ్ బిన్నీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. రీసెంటుగా ఈ సినిమా నుంచి వదిలిన నాగ్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. గతంలో నాగ్ – కీరవాణి కాంబినేషన్లో సూపర్ హిట్స్ ఉన్న సంగతి తెలిసిందే. అందువలన సహజంగానే ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి.

ఇటీవల కాలంలో నాగార్జునకి చెప్పుకోదగిన హిట్ పడలేదు. నాగార్జునకి రొమాంటిక్ హీరోగా క్రేజ్ ఉంది. ఆ రొమాన్స్ కి యాక్షన్ తోడైనప్పుడు ఆయన హిట్స్ అందుకున్న దాఖలాలు ఉన్నాయి. ఇక ఈ రెండింటికీ ఆయన మాస్ లుక్ కూడా యాడ్ అయినప్పుడు బ్లాక్ బస్టర్స్ పడిన సందర్భాలు ఉన్నాయి. అందువలన ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందనే బలమైన నమ్మకంతో నాగార్జున అభిమానులు ఉన్నారు. ఇక సంక్రాంతి సక్సెస్ సెంటిమెంట్ కూడా నాగ్ కి ఉండటం వలన, ఫ్యాన్స్ మరింత ధీమాను వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి ఈ సారి నాగ్ ఏ రేంజ్ లో మేజిక్ చేస్తాడో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular