Sunday, January 19, 2025
Homeసినిమానాగ్ మూవీ ఇప్పట్లో లేదా..?

నాగ్ మూవీ ఇప్పట్లో లేదా..?

లాస్ట్ ఇయర్ దసరాకి వచ్చిన ది ఘోస్ట్ బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎనినిమిది నెలలు అయ్యింది కానీ.. నాగ్ నుంచి కొత్త సినిమా అప్ డేట్ రాలేదు. వైల్డ్ డాగ్, ది ఘోస్ట్ చిత్రాలు యాక్షన్ మూవీస్ కావడం.. ఈ రెండు చిత్రాలు ఫ్లాప్ అవ్వడం… ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అయిన బంగార్రాజు సినిమా సక్సెస్ కావడంతో యాక్షన్ స్టోరీస్ పక్కనపెట్టి.. ఫ్యామిలీ స్టోరీతో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారని వార్తలు వచ్చాయి.

రైటర్ బెజవాడ ప్రసన్నను దర్శకుడిగా పరిచయం చేస్తూ నాగార్జున ఓ సినిమా చేయనున్నారని టాక్ వచ్చింది. గత కొన్ని రోజులు నుంచి జూన్ లో అనౌన్స్ మెంట్ ఉంటుందని.. జులైలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుందని టాక్ వచ్చింది. అయితే.. ఇటీవల అవికా గోర్ సినిమా ప్రమోషన్స కోసం మీడియాకు ముందుకు వచ్చిన నాగార్జునను కొత్త సినిమా ఎప్పుడు అని అడిగితే.. చేద్దాం.. తొందర ఏముంది..? అన్నారు. దీనిని బట్టి నాగార్జున ఇప్పుడు తన సినిమా విషయంలో అంతగా ఇంట్రస్ట్ చూపించడం లేదనిపిస్తుంది.

ఇటీవల వచ్చిన చైతన్య కస్టడీ సినిమా ఫ్లాప్ అయ్యింది. అలాగే అఖిల్ ఏజెంట్ మూవీ డిజాస్టర్ అయ్యింది. అందుచేత ఇప్పుడు తన సినిమా కన్నా.. కొడుకుల సినిమాల మీద కాన్ సన్ ట్రేషన్ ఎక్కువ చేయాలని ఫిక్స్ అయ్యారట. చైతన్య, చందు మొండేటి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని జీఏ 2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇక అఖిల్ నెక్ట్స్ ఏంటి అనేది ప్రకటించలేదు. అనిల్ అనే కొత్త దర్శకుడుతో సినిమా అని ప్రచారం జరుగుతుంది. యువీ బ్యానర్ లో ఈ సినిమా ఉంటుందని టాక్. ఈ లెక్కన కొడుకు సినిమాల పై కాన్ సన్ ట్రేషన్ చేసిన నాగ్ తను మాత్రం ఇప్పట్లో సినిమా చేసే మూడ్ లో లేడనే తెలుస్తుంది. మరి.. ఎప్పుడు ప్రకటిస్తాడో క్లారిటీ రావాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్