Mahesh-Alia: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న భారీ చిత్రం ‘సర్కారు వారి పాట‘. పరశురామ్ డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత మహేష్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ భారీ చిత్రం చేయనున్నారు. ఎప్పుడో ఈ సినిమాను ప్రకటించారు కానీ.. కరోనా కారణంగా ఆలస్యం అయ్యింది. ఇప్పుడు సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతుంది.
ఈ సినిమా తర్వాత మహేష్.. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో ఓ భారీ పాన్ ఇండియా మూవీ చేయనున్నారు. ఈ సినిమా కోసం పాన్ ఇండియా రైటర్ విజయేంద్రప్రసాద్ స్టోరీ రెడీ చేస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ సరసన అలియాను సెట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాను తెరకెక్కించడానికి జక్కన్న ప్లాన్ చేసినట్లు సమాచారం. అందుకే అలియా అయితే పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారట. అయితే.. ప్రచారంలో ఉన్న ఈ వార్త వాస్తవమేనా..? కాదా..? అనేది తెలియాల్సివుంది.