Sunday, January 19, 2025
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్అలిపిరి నడక మార్గం మూసివేత

అలిపిరి నడక మార్గం మూసివేత

తిరుప‌తి నుండి తిరుమ‌ల‌కు వెళ్లే అలిపిరి కాలిన‌డ‌క మార్గం జూన్ 1 నుండి 31వ తేదీ వ‌ర‌కు మూసివేస్తున్నట్లు టిటిడి తెలియజేసింది. పైక‌ప్పు పున‌ర్నిర్మాణ‌ ప‌నుల‌ను పూర్తి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని టిటిడి ప్ర‌జాసంబంధాల అధికారి ఓ ప్రకటనలో వెల్లడించారు.

అయితే కాలిన‌డ‌క‌న తిరుమ‌ల‌కు వెళ్లాల‌నుకునే భ‌క్తులు శ్రీ‌వారి మెట్టు మార్గం ద్వారా వెళ్లాల‌ని కోరింది. ఇందుకోసం అలిపిరి నుండి శ్రీ‌వారి మెట్టు వ‌ర‌కు ఉచిత బ‌స్సుల ద్వారా భ‌క్తుల‌ను త‌ర‌లించేందుకు టిటిడి ఏర్పాట్లు చేప‌ట్టింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి టిటిడికి స‌హ‌క‌రించాల‌ని విజ్ఞప్తి చేసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్