Tuesday, March 11, 2025
Homeసినిమాకార్తికేయ జోరు తగ్గిందే!

కార్తికేయ జోరు తగ్గిందే!

కార్తికేయ పేరు వినగానే అందరికీ ‘RX 100’ సినిమా గుర్తుకు వస్తుంది. రొమాన్స్ పాళ్లు ఎక్కువగా ఉన్న కారణంగా ఆ సినిమా యూత్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకుంది. పాయల్ తన అందాలను వడ్డించిన తీరును కుర్రాళ్లు చాలా కాలం పాటు మరిచిపోలేకపోయారు. ఇక కార్తికేయ మంచి ఫిజిక్ తో యూత్ లో తనకంటూ ఒక ఫాలోయింగ్ ను పెంచుకున్నాడు. ఆయన ఫిజిక్ ఆయనకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది. అదే ఆయనకి ఆ తరువాత సినిమాల్లో ఛాన్సులు తెచ్చిపెట్టింది.

కార్తికేయ నటన విషయంలో నిదానంగా నేర్చుకుంటూ వచ్చాడు. అయితే ఒక యాక్షన్ హీరోకి ఉండవలసిన ఫిజిక్ తో పాటు, మంచి డాన్సర్ కావడం కూడా బాగా కలిసొచ్చింది. ఇక హీరోగా మాత్రమే కాదు విలన్ గాను రాణించగల షేడ్స్ ఆయనలో ఉన్నాయి. అందువలన మొత్తానికి సినిమాకి కావలసిన మెటీరియల్ ఉన్న కుర్రాడిగానే మార్కులు కొట్టేశాడు. ఇక ఆర్ధికంగా కూడా కాస్త మంచి నేపథ్యం నుంచే వచ్చినవాడు కావడం వలన, అవసరమైతే నిర్మాణ రంగం దిశగా దృష్టిపెడుతూ వచ్చాడు.

అయితే కొత్తగా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు .. అందరిలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు దక్కుతున్నప్పుడు .. అవకాశాలు వస్తున్నప్పుడు ఆ సంతోషంలో వరుస ప్రాజెక్టులు ఒప్పుకోవడం జరుగుతుంది. ఆ సినిమాలు ఆశించిన స్థాయిని అందుకోలేకపోయినప్పుడు అసలు విషయం అర్థమవుతుంది. కథల ఎంపిక విషయంలో జాగ్రత్తగా ఉండాలనే ఒక నిర్ణయానికి వచ్చేలోగానే జరగవలసిన నష్టం జరిగిపోతుంటుంది. అలా కాస్త వెనుకబడిన కార్తికేయ ‘బెదురులంక 2012’ సినిమా చేశాడు. ఈ సినిమా విడుదల విషయంలో ఇంకా ఒక క్లారిటీ రాలేదు. ఆయన కొత్త ప్రాజెక్టుల గురించిన అప్ డేట్ లేదు. మరి ఇకనైనా కార్తికేయ కాస్త స్పీడ్ పెంచుతాడేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్