Saturday, January 18, 2025
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్డెల్టా ప్లస్ పై ఆందోళన వద్దు : ఆళ్ల నాని

డెల్టా ప్లస్ పై ఆందోళన వద్దు : ఆళ్ల నాని

కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ పై ఆందోళన అవసరం లేదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్య శాఖ) ఆళ్ల నాని చెప్పారు. తిరుపతిలో ఒక డెల్టా కేసు నమోదైన విషయాన్ని ధ్రువీకరించిన నాని, బాధితుడికి అవసరమైన వైద్య చికిత్స అందించామని, డిశ్చార్జ్ కూడా అయ్యారని…అతని నుంచి ఎవరికీ వ్యాప్తి కాలేదని వెల్లడించారు. బ్లాక్ ఫంగస్, డెల్టా ప్లస్ కేసుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్ స్పష్టమైన ఆదేశాలిచ్చారని నాని వివరించారు. కోవిడ్ పరిస్థితిపై వైద్య శాఖ అధికారులతో డిప్యుటీ సిఎం సమీక్ష నిర్వహించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో డెల్టా ప్లస్ వేరియంత్ యాక్టివ్ కేసులు లేవని ఆళ్ల నాని స్పష్టం చేశారు. ప్రస్తుతం రోజుకు లక్ష టెస్టుల వరకూ నిర్వహిస్తున్నామని, ఐదు వేల లోపే పాజిటివ్ కేసులు వస్తున్నాయని వివరించారు. కరోనా మూడో దశ వస్తుందనే స్పష్టత లేకపోయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, రాష్ట్రంలో ప్రస్తుతం అమలు చేస్తున్న నైట్ కర్ఫ్యూ ను కొనసాగించాలా వద్దా అనే విషయమై సిఎం జగన్ తీసుకుంటారని అల్లా నాని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్