Saturday, January 18, 2025
Homeసినిమామళ్లీ కామెడీ ట్రాక్ లోకి వచ్చిన అల్లరి నరేశ్!

మళ్లీ కామెడీ ట్రాక్ లోకి వచ్చిన అల్లరి నరేశ్!

‘అల్లరి’ నరేశ్ .. రాజేంద్రప్రసాద్ తరువాత హాస్యకథానాయకుడిగా తన జోరును చూపించిన నటుడు. చాలా వేగంగా 50 సినిమాలను పూర్తి చేసిన నరేశ్, ఇప్పుడు 100 సినిమాలకు దగ్గరలో ఉన్నాడు. అల్లరి నరేశ్ బాడీ లాంగ్వేజ్ ను .. డైలాగ్ డెలివరినీ అంతా కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఆయన సినిమాలను ఇప్పటికీ టీవీల్లో వదలకుండా చూస్తూనే ఉంటారు. అలాంటి నరేశ్ కి ఆ మధ్య వరుస ఫ్లాపులు ఎదురయ్యాయి. దాంతో ఆయన చాలా డీలాపడిపోయాడు. ఎలాంటి కథలను చేయాలనే విషయంలో ఒక క్లారిటీకి రాలేకపోయాడు.

అలాంటి అల్లరి నరేశ్ కి ఆ సమయంలో సీరియస్ సబ్జెక్టులు హిట్లు పట్టుకొచ్చాయి. దాంతో తన నుంచి ప్రేక్షకులు సీరియస్ కంటెంట్ ను కోరుకుంటున్నారని ఆయన భావించాడు. అలాంటి కథలు కథలు చేయడానికి మొగ్గు చూపాడు. అయితే ఒకటి రెండు సినిమాల తరువాత అక్కడ కూడా ఆయనకి అదే పరిస్థితి ఎదురైంది. నిజానికి నరేశ్ నుంచి అడపా దడపా సీరియస్ రోల్స్ వస్తే చూడటానికి ఆడియన్స్ ఆసక్తిని చూపించవచ్చు. నిజానికి ఆయన కామెడీ చేయడమే అందరికీ ఇష్టం.

ఈ నేపథ్యంలో అల్లరి నరేశ్ మళ్లీ కామెడీ ట్రాక్ వైపు అడుగులు వేస్తూ ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమా చేశాడు. గతంలో ఈవీవీ ఇదే టైటిల్ తో చేసిన సినిమా ఇప్పటికీ ఆడియన్స్ కి గుర్తుండిపోయింది. ఈ నేపథ్యంలో మళ్లీ ఇంతకాలానికి ఈ టైటిల్ తో నరేశ్ చేశాడు. ఆ సినిమాలో మాదిరిగానే ఈ సినిమాలోనూ హీరో- హీరోయిన్స్ పెళ్లి బట్టల్లో కనిపించడం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మే 3వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను వదిలారు. చూడాలి మరి నరేశ్ చేసే నవ్వుల సందడి ఏ రేంజ్ లో ఉంటుందో.

RELATED ARTICLES

Most Popular

న్యూస్