Saturday, January 18, 2025
HomeTrending Newsకెసిఆర్ ను వదిలే ప్రసక్తే లేదు - ఈటెల రాజేందర్

కెసిఆర్ ను వదిలే ప్రసక్తే లేదు – ఈటెల రాజేందర్

శాసనసభ నుంచి అకారణంగా, అత్యంత దుర్మార్గంగా సస్పెండ్ చేశారని బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మండిపడ్డారు. అసెంబ్లీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బలవంతంగా పోలీసు వాహనంలో ఎక్కించి తీసుకెళ్లారు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టన్నారు. మరమనిషి అంటే సొంత అలోచన లేకుండా ఇతరులు చెప్పినట్టు చేసే వారని, తాను రాజీనామా చేసినప్పుడు కనీసం నా రాజీనామా లేఖ తీసుకోకుండా స్పీకర్ అవమాన పరిచారని ఈటెల గుర్తు చేశారు. హైదరాబాద్ లోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఈ రోజు విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఈటెల రాజేందర్ ప్రభుత్వం తీరుపై ఘాటుగా విమర్శలు చేశారు. ఈ సమావేశంలో శేఖర్ జీ, తుల ఉమ, జైపాల్  అశ్వద్ధామ రెడ్డి , పాల్వాయి రజనీ , కేశవరెడ్డి , సునీత రెడ్డి , సంపత్ రావు , ఆంజనేయులు , కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈటెల రాజేందర్ ఆరోపణలు ఆయన మాటల్లోనే…
294 మంది ఎమ్మెల్యేలు, 36 మంది మంత్రులు, 10-12 పార్టీలకు రూమ్ సరిపోయినప్పుడు. ఇప్పుడు రూమ్ కేటాయించకుండా అవమానపరచారు.
గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలు ఉండదు. ఎందుకు ఉండవు అని అడిగినందుకు మమ్ముల్ని సస్పెండ్ చేశారు. స్పీకర్
మా హక్కులు కాపాడలేక పోయారు.
BAC కి మమ్ముల్ని పిలవలేదు అని స్పీకర్ ని అడిగితే ముఖ్యమంత్రిని అడగమన్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు కలిసి అసెంబ్లీ అజెండా తయారు చేస్తారు. కానీ సీఎం ఏ అంశాలు ఇచ్చారో వాటికే MIM, కాంగ్రెస్ తలవంచి వచ్చారు.
మరమనిషి అన్నందుకే ఇంత బాధ పడుతున్నారు. కెసిఆర్ ప్రధానిని ఫాసిస్ట్ అన్నారు, దద్దమ్మ, చవట, బ్రస్టులు, రండ, లఫుట్, సన్యాసి, మతపిచ్చి, కులపిచ్చి గాళ్ళు అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడారు. ఈ భాష గొప్పదట, అది ప్రజల బాషా అని తెలంగాణ ప్రజలను అవమాన పరుస్తున్నారు కెసిఆర్. సంస్కార హీనుడు, అబద్దాల కోరు కెసిఆర్. దేనినైనా తనకు అనుకూలంగా మలుచుకునే అబద్దాల కోరు కెసిఆర్.
బీసీ బిడ్డగా ఒక గవర్నర్ వస్తె గౌరవించని సంస్కార హీనులు కెసిఆర్, ఆయన పార్టీ. హెచ్చరిస్తున్నా తాటాకు చప్పుళ్లకు భయపడను ఆనాడే సీఎం ను భయపెట్టిన, చంపుతా అంటే భయపడలేదు. నాకు ఏమన్నా అయితే అగ్ని గుండం అయితది అని చెప్పిన.
నయీం ముఠా బెదిరింపులకే భయపడలేదు. హుజూరాబాద్ లో పదుల సంఖ్యలో గన్ లైసెన్సులు ఇచ్చి బెదిరింపులకు దిగుతున్నారు. నాకు, నా కుటుంబ సభ్యులకు ఒక్క రక్తం బొట్టు చిందిన దానికి భాధ్యత ముఖ్యమంత్రి కెసిఆర్ దే. ఎన్ని వచ్చినా వెనుకడుగు వెయ్యని వాడిని నేను. హుజూరాబాద్ లో నిన్ను తిరస్కరించి నన్ను సభాలో ఉండమని చెప్పి పంపారు. కానీ ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. కెసిఆర్ ను ఓడగొట్టే వరకు విశ్రమించను. దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీ రద్దు చేసి ప్రజాభిప్రాయానికి రండి.
 కెసిఆర్ మాటలు తెలంగాణ ప్రజలు నమ్మరు. కెసిఆర్ నైజం గమనించాల్సింది ప్రజలు.. పరిష్కారం, జడ్జిమెంట్ ఇవ్వాల్సింది ప్రజలు.
నన్ను బయటికి పంపిన తీరు సరిగా లేదు. సభ్యులు సస్పెండ్ అయినా కూడా అసెంబ్లీ అవరణలో ఉండవచ్చు. కానీ నన్ను మీడియా పాయింట్ కి పోనివ్వలేదు. గాంధీ విగ్రహం దగ్గరకి వెళ్లనియ్యలేదు. చివరికి మా పార్టీ ఆఫీస్ కి వెళ్తా అన్నా కూడా వెళ్లనీయకుండా.. ఇంటికి తీసుకొని వచ్చి హౌస్ అరెస్ట్ చేశారు. ప్రజాస్వామ్యం ఖూనీ చేసిన వారు కెసిఆర్, కెసిఆర్ చెప్తే అమలు చేసింది స్పీకర్. కెసిఆర్ మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయి. దమ్ములేక, దద్దమ్మలు అయి మమ్ముల్ని బయటికి పంపించారు.
ఈటల ఉంటే ఫైనాన్స్ మీద మాట్లాడతారు.. సమాధానం మా దగ్గర ఉండదు అని నన్ను బయటికి పంపించారు. గెలిచి సంవత్సర కాలం అయ్యింది అయిన అసెంబ్లీ లోపలికి అడుగుపెట్ట నివ్వడం లేదు. నా సస్పెన్షన్ పై న్యాయ నిపుణులను సప్రదిస్తున్నం. అన్ని రాష్ట్రాల స్పీకర్ లకు లేఖ రాస్తా. కేసీఆర్ దుర్మార్గాన్ని ప్రజల ముందు ప్రచారం చేసి కేసీఆర్ ను ఓడగొట్టడమే నా లక్ష్యం.
RELATED ARTICLES

Most Popular

న్యూస్