బిజెపి-తెలుగుదేశం-జనసేన కూటమి సీట్ల సర్దుబాటు చర్చలు మొదలయ్యాయి. సీట్ల పంపకాలపై ఓ అవగాహనకు వచ్చిన ఈ పార్టీలు, ఏయే సీట్లలో ఎవరు పోటీ చేయాలనేదానిపై ఓ నిర్ణయానికి రానున్నాయి. ఇప్పటికే 94 సీట్లలో తెలుగుదేశం, 5 సీట్లలో జనసేన అభ్యర్ధులను తొలి విడతలో ప్రకటించిన సంగతి తెలిసిందే. నిడదవోలు సీటుకు కందుల దుర్గేశ్ పేరును నేడు జనసేన ఖరారు చేసింది. ఇక మిగిలిన 75 సీట్లలో జనసేన 18, బిజెపి 6 … తెలుగుదేశం 51 సీట్లకు అభ్యర్ధులను ప్రకటించాల్సి ఉంది.
తాడేపల్లిలో చంద్రబాబు నివాసంలో జరిగిన చర్చల్లో టిడిపి తరఫున బాబు, అచ్చెన్నాయుడు… జనసేన నుంచి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్… బిజెపి నుంచి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడు జయంత్ పండా గారు పాల్గొన్నారు.
కదిరి, శ్రీకాహహస్తి, మదనపల్లె, పి. గన్నవరం స్థానాలకు సంబంధించిన చర్చలు ప్రముఖంగా వచ్చినట్లు తెలిసింది. బిజెపి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు ఏ స్థానం కేటాయించాలనేదానిపై కూడా సమావేశంలో చర్చకు వచ్చిందని, ఉమ్మడి మేనిఫెస్టోలో పొందుపరిచేందుకు బిజెపి తరఫున ఏవైనా అంశాలు ఉన్నాయా అనే దానిపై కూడా నేతలు చర్చించారు.