మంత్రులకు శాఖలు కేటాయిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం వెల్లడించారు. శాఖల కేటాయింపుపై అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం ఉదయమే శాఖల కేటాయింపునకు సంబంధించి… మంత్రులకు సమాచారం అందించారు. కీలకమైన హోంశాఖ, విద్యుత్ శాఖలు ముఖ్యమంత్రి వద్దే ఉండనున్నాయి.
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క- ఆర్థికశాఖ మంత్రి
ఉత్తమ్ కుమార్‌రెడ్డి – భారీ నీటిపారుదల శాఖ మంత్రి, పౌరసరఫరాలు
దుద్దిళ్ల శ్రీధర్‌బాబు- ఐటీ మంత్రి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాలు
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి – రోడ్లు, భవనాల శాఖ,సినిమాటోగ్రఫీ
సీతక్క- పంచాయతీరాజ్
కొండా సురేఖ- అటవీ శాఖ, దేవాదాయశాఖ
పొన్నం ప్రభాకర్- రవాణాశాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి
తుమ్మల నాగేశ్వరరావు- వ్యవసాయశాఖ మంత్రి, మార్కెటింగ్, సహకార, చేనేత శాఖ
జూపల్లి కృష్ణారావు- ఎక్సైజ్ శాఖ మంత్రి, టూరిజం & కల్చర్ మరియు ఆర్కియాలజీ.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి- సమాచార శాఖ, రెవెన్యూ,గృహ నిర్మాణం
దామోదర రాజనర్సింహ- వైద్య ఆరోగ్యశాఖ మంత్రి
మరోవైపు ఆరు మంత్రి పదవి ఖాళీలపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ ఖాళీలను వెంటనే కాకుండా…. సమయం తీసుకొని భర్తీ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ప్రస్తతం తెలంగాణ కేబినెట్ లో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి ఏ ఒక్కరికి ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంలో అవకాశం దక్కలేదు.