Sunday, January 19, 2025
Homeసినిమాఅల్లు అరవింద్ కు ఆగ్రహం వచ్చింది. అసలు ఏమైంది..?

అల్లు అరవింద్ కు ఆగ్రహం వచ్చింది. అసలు ఏమైంది..?

గీతా ఆర్ట్స్ అధినేత, అల్లు అరవింద్ ఇప్పటి వరకు ఎన్నో విజయవంతమైన చిత్రాలు అందించారు. ఎంతో మంది నటీనటులు, టెక్నీషియన్స్ తో వర్క్ చేశారు. చాలా కూల్ గా ఉంటారు. అయితే.. అంత కూల్ గా ఉండే అల్లు అరవింద్ కు ఆగ్రహం వచ్చింది. ఎవరైతే ఆయనకు కోపం వచ్చేలా చేసారో వాళ్ల గురించి చెప్పేందుకు ప్రెస్ మీట్ కూడా పెట్టాలనుకున్నారు. ఆతర్వాత ఏమైందో ఏమో కానీ.. ఆ ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేశారు. ఇంతకీ విషయ ఏంటంటే..విజయ్, పరశురామ్, దిల్ రాజు కాంబినేషన్లో ఓ మూవీ వస్తున్నట్లు ప్రకటించారు.

అయితే.. విజయ్, పరశురామ్ కాంబినేషన్లో అల్లు అరవింద్ ఓ సినిమా చేయాలనుకున్నారు. పరశురామ్ కి ఎప్పుడో అడ్వాన్స్ ఇచ్చారు. ఈలోగా కొత్త సినిమా ప్రకటన వార్త బయటకు రావడంతో అల్లు అరవింద్ దిల్ రాజును నిలదీస్తే…. అలాంటిది ఏమీ లేదు.. మీ డైరెక్టర్ ను నేనేమీ లాగేసుకోలేదు’  అని దిల్ రాజు మెసెజ్ పెట్టారట. అలా పెట్టిన రోజు సాయంత్రమే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్  చేయడం అల్లు అరవింద్ కు బాగా కోపం తెప్పించింది. నేను అడిగితే లేదని చెప్పి.. సినిమాని అనౌన్స్ చేస్తారా అని చాలా కోపంగా ఉన్నారట.

అందుకనే ప్రెస్ మీట్ పెట్టి విజయ్, పరశురామ్, దిల్ రాజుల గురించి మాట్లాడాలి అనుకున్నారట. ఇది తెలిసి పరశురామ్ తన భార్యతో కలిసి అల్లు అరవింద్ ను కలిసే ప్రయత్నం చేస్తే.. అపాయింట్ మెంట్ ఇవ్వలేదట. ఆతర్వాత అల్లు అరవింద్ ఇంటికి పరశురామ్ తన భార్యతో కలిసి వెళ్లారట. అక్కడ ఆయన తన ఆగ్రహాన్ని అంతా వ్యక్తం చేసి ఇక మీకు ఏ అవసరం వచ్చినా అల్లు అరవింద్ ఉండరు అని చెప్పి పంపించేశారని ప్రచారం జరుగుతుంది. ఇన్నాళ్లలో ఇలాంటి అన్ ప్రొఫెషనలిజం ఎప్పుడూ చూడలేదని అల్లు అరవింద్ బాగా హర్ట్ అయ్యారట. మొత్తానికి విజయ్, పరశురామ్, దిల్ రాజు కలిసి అల్లు అరవింద్ ఆగ్రహానికి కారకులయ్యారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మరి.. భవిష్యత్ లో అయినా అల్లు అరవింద్ వీళ్లతో మాట్లాడతారో.. లేక కోపాన్ని కంటిన్యూ చేస్తారో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్