Saturday, June 29, 2024
Homeసినిమాబన్నీ, త్రివిక్రమ్ మూవీ ఇంట్రస్టింగ్ న్యూస్

బన్నీ, త్రివిక్రమ్ మూవీ ఇంట్రస్టింగ్ న్యూస్

అల్లు అర్జున్, తివిక్రమ్ శ్రీనివాస్.. ఇద్దరూ కలిసి జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల.. వైకుంఠపురములో చిత్రాలు చేయడం.. ఈ మూడు చిత్రాలు బిగ్ సక్సెస్ సాధించడం తెలిసిందే. వీరిద్దరూ కలిసి మరో సినిమా చేయనున్నారు. ఈ భారీ, క్రేజీ మూవీని ఇటీవల ప్రకటించడం జరిగింది. అయితే.. బన్నీ ప్రస్తుతం పుష్ప 2 చేస్తున్నారు. సుకుమార్ డైరెక్షన్ లో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ ఈ ఇయర్ లో వస్తుంది అనుకుంటే.. వచ్చే సంవత్సరం ఆగష్టు 15న విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. అయితే.. బన్నీతో సినిమా చేసేందుకు త్రివిక్రమ్ తో పాటు అట్లీ, బోయపాటి కూడా వెయిటింగ్ లో ఉన్నారు.

దీంతో బన్నీ నెక్ట్స్ మూవీ త్రివిక్రమ్ తో ఉంటుందా..? అట్లీతో ఉంటుందా..? లేక బోయపాటితో ఉంటుందా..? అనేది ఆసక్తిగా మారింది. అయితే.. బన్నీ నెక్ట్స్ త్రివిక్రమ్ తోనే ఉంటుందని టాక్ వినిపిస్తోంది. తాజా వార్త ఏంటంటే.. ఈ సినిమా స్టోరీ.. ముంబాయి బ్యాక్ డ్రాప్ లో ఉండే పవర్ ఫుల్ పోలీస్ స్టోరీ అని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని భారీ పాన్ ఇండియా మూవీగా ప్లాన్ చేస్తున్నారు. త్రివిక్రమ్ చేస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ సినిమా పై ఇప్పటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రాన్ని హారిక అండ్ హసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి.

మరి.. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుంది అంటే… జనవరి మూడోవారం నుంచి ఈ మూవీని ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇందులో బన్నీకి జంటగా పూజా హేగ్డే నటించనున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. గతంలో బన్నీ, పూజా కలిసి దువ్వాడ జగన్నాథమ్, అల.. వైకుంఠపురములో చిత్రాల్లో నటించారు. ఈ రెండు చిత్రాలు సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు మూడోసారి బన్నీ, పూజా కలసి సినిమా చేస్తే.. ఈ మూవీకి మరింత క్రేజ్ రావడం ఖాయం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్