ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చరిత్ర సృష్టించాడు. 69 ఏళ్ళ చలన చిత్ర జాతీయ అవార్డుల చరిత్రలో తొలిసారి తెలుగు పరిశ్రమ నుంచి జాతీయ ఉత్తమ నటుడి అవార్డును గెల్చుకున్న మొదటి హీరోగా తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు.
కాసేపటి క్రితం ప్రకటించిన 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఆర్ ఆర్ ఆర్ సినిమా సత్తా చాటింది. మొత్తం ఆరు విభాగాల్లో పురస్కారాలు దక్కించుకుంది. జాతీయ ఉత్తమ నటుడిగా పుష్ప (ద రైజ్) లో అద్భుత నటన ప్రదర్శించిన అల్లు అర్జున్ కు లభించింది.
ఉత్తమ చిత్రాలుగా…
బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ కు లభించింది.
పర్యావరణ పరిరక్షణ విభాగంలో ఆవాసవ్యూహం (మలయాళం)
సామాజిక అంశాలపై… అనునాద్ ది రెజోనేన్స్ (అస్సామీ)
జాతీయ సమైక్యతా విభాగంలో నర్గీస్ దత్ అవార్డు ది కాశ్మీర్ ఫైల్స్ కు;
ఉత్తమ చిత్రంగా గోదావరి (మరాఠీ)
ఉత్తమ బాలల చిత్రంగా గాంధీ అండ్ కో (గుజరాతి)
ఉత్తమనటిగా ‘గంగూ భాయి ఖత్వాడి’ సినిమాకు గాను అలియా భట్; ‘మిమి’ సినిమాకు కృతి సనం సంయుక్తంగా దక్కించుకున్నారు.
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా పుష్ప, ఆర్ ఆర్ ఆర్ సినిమాలకు గాను దేవిశ్రీ ప్రసాద్, ఎంఎం కీరవాణిలకు సంయుక్తంగా దక్కాయి.డెబ్యూ డైరెక్టర్ కు ఇచ్చే ఇందిరాగాంధీ అవార్డును మెప్పడియాన్ (మలయాళం) విష్ణు మోహన్ కు
ఆర్ ఆర్ ఆర్ కు…. బెస్ట్ స్టంట్స్( కింగ్స్ సోలోమన్); కోరియోగ్రఫీ (ప్రేమ రక్షిత్); స్పెషల్ ఎఫెక్ట్స్ ( శ్రీనివాస్ మోహన్), ఉత్తమ గాయకుడి(మేల్) గా (కాల భైరవ-కొమురం భీముడో) లకు అవార్డులు దక్కాయి. అత్యుత్తమ ప్రజాదరణ పొందిన సినిమా, ఉత్తమ సంగీత దర్శకుడు…విభాగాల్లో అవార్డులు గెల్చుకుంది.
క్రిటిక్స్ విభాగంలో పురుషోత్తమా చార్యులు కు అవార్డు దక్కగా, ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘ఉప్పెన’ కు పురస్కారం దక్కింది.
‘కొండపోలం’ లో ధమ్ ధమా ధమ్ పాటకు ఉత్తమ గేయ రచయిత అవార్డు చంద్రబోస్ కు దక్కింది