Saturday, March 14, 2026
HomeసినిమాAllu Arjun: బన్నీ నెక్ట్స్ మూవీ ఎవరితో.?

Allu Arjun: బన్నీ నెక్ట్స్ మూవీ ఎవరితో.?

అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘పుష్ప 2’. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇటీవల పుష్ప చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటుడు అవార్డ్ ప్రకటించడంతో పుష్ప 2 సినిమా పై మరింతగా క్రేజ్ ఏర్పడింది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది మేకర్స్ అఫిషియల్ గా ప్రకటించనున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో పుష్ప 2 షూటింగ్ శరవేగంగా జరపుకుంటుంది. మార్చి 22న పుష్ప 2 రిలీజ్ అంటూ ప్రచారం జరుగుతుంది.

అయితే.. పుష్ప 2 తర్వాత బన్నీ సినిమా ఎవరితో అనేది ఆసక్తిగా మారింది. తాజా సమాచారం ప్రకారం.. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అల్లు అర్జున్ సినిమా చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే.. ఇది మామూలు రెగ్యులర్ కమర్షియల్ మూవీ కాదని… ఇదొక పీరియాడిక్ డ్రామా అని వార్తలు వస్తున్నాయి. పైగా ప్లాష్‌ బ్యాక్ లో సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాయి.

పుష్ప 2 తర్వాత చేసే సినిమా.. అలాగే అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న నాలుగవ సినిమా కావడంతో ఈ సినిమా పై అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాను త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందించనున్నారని సమాచారం. అలాగే బాలీవుడ్ స్టార్స్ ఈ సినిమాలో నటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఈ చిత్రాన్ని ఎవరూ ఊహించని విధంగా అత్యంత భారీగా ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

Also Read: National Awards: ఉత్తమ నటుడు అల్లు అర్జున్ -RRR కు ఆరు అవార్డులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular