అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప 2’ మూవీ చేస్తున్నారు. సుకుమార్ డైరెక్షన్ లో రూపొందుతున్న చిత్రాన్ని సంక్రాంతికి కానీ.. సమ్మర్ లో కానీ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత బన్నీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో భారీ పాన్ ఇండియా మూవీ చేయనున్నారు. ఈ చిత్రాన్ని ఆల్రెడీ ప్రకటించారు. పుష్ప 2 కంప్లీట్ అయిన తర్వాత ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే.. బన్నీఇద్దరు దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని మాత్రం వార్తలు వస్తున్నాయి.
ఇంతకీ ఆ ఇద్దరు ఎవరంటే.. ఒకరు త్రివిక్రమ్ శ్రీనివాస్. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కలిసి ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అల.. వైకుంఠపురములో’ చిత్రాలు చేశారు. ఈ సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఇప్పుడు మరో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు. ఆల్రెడీ త్రివిక్రమ్ చెప్పిన స్టోరీ లైన్ ను బన్నీ ఓకే చేశారట. మహేష్ బాబుతో చేస్తున్న మూవీ తర్వాత త్రివిక్రమ్ బన్నీతో చేయనున్న మూవీ వర్క్ స్టార్ట్ చేస్తాడు. ఇక బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రెండో డైరెక్టర్ ఎవరంటే… సురేందర్ రెడ్డి అని వినిపిస్తుంది. ఇటీవల ఏజెంట్ మూవీతో ప్లాప్ ఇచ్చాడు. అయినప్పటికీ సురేందర్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.
బన్నీ, సురేందర్ రెడ్డి కలిసి ‘రేసుగుర్రం’ అనే సినిమా చేశారు. బ్లాక్ బస్టర్ అయ్యింది. అప్పటి నుంచి మళ్లీ కలిసి సినిమా చేయాలి అనుకుంటున్నారు. ఇప్పటికి అంతా సెట్ అయ్యిందని టాక్ వినిపిస్తుంది. గతంలో సురేందర్ రెడ్డి చెప్పిన స్టోరీ లైన్ కు బన్నీ ఓకే చెప్పారు. ఆ స్టోరీ లైన్ ను ఫుల్ స్టోరీగా అద్భుతమైన కథగా రెడీ చేస్తే సినిమా చేయడానికి రెడీ అని చెప్పారట. త్వరలో ఈ ఇద్దరు దర్శకులతో సినిమాలను అనౌన్స్ చేయాలి అనుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి. మరి.. త్వరలో ప్రకటిస్తాడేమో చూడాలి.