Saturday, January 18, 2025
Homeసినిమాతెలుగమ్మాయిలు సినిమాల్లోకి వచ్చేయండి.. బేబీ ఈవెంట్‌ లో అల్లు అర్జున్‌.

తెలుగమ్మాయిలు సినిమాల్లోకి వచ్చేయండి.. బేబీ ఈవెంట్‌ లో అల్లు అర్జున్‌.

ఇక ఈ సినిమాపై సామాన్యులే కాకుండా.. సినీ ప్రముఖులు, డైరెక్టర్స్, నటీనటులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమా కథా ప్రతి ఒక్కరి మనసులను తాకుతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.వైష్ణవి చైతన్య పై పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించాడు. ఇటీవల విడుదల సంచలన విజయం సాధించిన ‘బేబి’ మూవీని చూసిన అల్లు అర్జున్.. చిత్రయూనిట్ ను అభినందించేందుకు గురువారం సాయంత్రం స్పెషల్ ఈవెంట్ ను నిర్వహించారు.

ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. యూనిట్ పై ప్రశంసల జల్లు కురిపించారు. “లవ్ లో ఉన్న పెయిన్ ను చూపిస్తూ సినిమాలు తీయడం చాలా కష్టమైన విషయం. అలాంటి సినిమాను అద్భుతంగా తీసిన దర్శకుడు సాయి రాజేశ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తెలుగు అమ్మాయిని పెట్టి ఇలాంటి మూవీని తీసిన సాయి రాజేశ్ గట్స్ బాగా నచ్చాయి. నేను ఈ ఈవెంటుకు రావడానికి మఖ్య కారణం వైష్ణవినే. ‘అల వైకుంఠపురములో’ సినిమాలో వైష్ణవి నా సిస్టర్ రోల్ చేసింది. ఇలాంటి తెలుగు అమ్మాయిలను హీరోయిన్ గా పెట్టి సినిమాలు చేసే రోజులు ఎప్పుడు వస్తాయా అని ఆ రోజున అనుకున్నాను.

ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎదైనా అవార్డు ఫంక్షన్ కు వెళితే.. తమిళ్, మలయాళం, కన్నడ అమ్మాయిలు వచ్చి అవార్డు అందుకుని వారి భాషలో ధన్యవాదాలు చెబుతున్నారు. అప్పుడు మన తెలుగు అమ్మాయి ఒక్కరు కూడా లేరని చాలా బాధపడ్డా. ఈమధ్య వైష్ణవి క్లిప్ ఒకటి చూశా. తెలంగాణ యాస చాలా బాగా మాట్టాడింది. ఈ సినిమాలో వైష్ణవి తన యాక్టింగ్ తో అదరగొట్టింది. ఈ సంవత్సరం బెస్ట్ హీరోయిన్ గా అవార్డు అందుకోవడం ఖాయం. ఇక నుంచి తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీకి రావాలని కోరుకుంటున్నాను. వైష్ణవి ఇక నుంచి ఎంతో మంది తెలుగు అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలుస్తుంది” అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్