Saturday, January 18, 2025
Homeసినిమా‘గని’ సెట్ లో బన్నీ

‘గని’ సెట్ లో బన్నీ

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గని’. ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో వరుణ్ తేజ్ సరసన బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ నటిస్తుంది. ఈ సినిమా ద్వారా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కుమారుడు, అల్లు అర్జున్ సోదరుడు అల్లు వెంకటేష్  నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నాడు. బ్యాక్సింగ్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా రూపొందుతోంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ కి బ్రేక్ పడింది. అయితే.. తాజాగా గని షూటింగ్ తిరిగి స్టార్ట్ చేశారు.

అయితే.. గని షూటింగ్ స్పాట్ కి అల్లు అర్జున్ వెళ్లారు. సెట్ లో అందర్నీ సర్ ఫ్రేజ్ చేశాడు. తన అన్నయ్య ఈ చిత్రానికి నిర్మాత, ఇక వరుణ్ తేజ్ హీరో.. ఇద్దరు తన వాళ్ళే కాబట్టి విష్ చేయాలని ప్రత్యేకంగా సెట్‌కి వచ్చారట. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో రూపొందుతోన్న గని సినిమా త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ సక్సస్ సాధిచాలని కోరుతూ, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియచేశారు బన్నీ. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. ఇక బన్నీ నటిస్తున్న పుష్ప పార్ట్ 1 ఈ సంవత్సరం చివరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్