Saturday, January 18, 2025
Homeసినిమాఅల్లు అర్జున్ అలా క‌నిపించ‌నున్నాడా?

అల్లు అర్జున్ అలా క‌నిపించ‌నున్నాడా?

Pushpa-2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్లో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ పుష్ప. ఈ సినిమా ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేయ‌డంతో పుష్ప 2 ఎప్పుడెప్పుడు వ‌స్తుందా అని అభిమానులు ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. పుష్ప ఫ‌స్ట్ పార్ట్ గురించి వ‌చ్చిన విమ‌ర్శ‌లు సెకండ్ పార్ట్ లో రిపీట్ చేయకుండా ఉండేందుకు.. పుష్ప ది రూల్ స్ర్కిప్ట్ ను మరింత పగడ్బందీగా రాసుకుంటున్నాడట సుకుమార్.

దాని కోసం కాస్తంత ఎక్కువ సమయాన్నే తీసుకుంటున్నాడని తెలిసింది. అందుకే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళేందుకు మరింత టైమ్ పట్టొచ్చని సమాచారం. ఇదిలా ఉంటే.. పుష్ప 2 కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. పుష్ప రెండో భాగంలో అల్లు అర్జున్  55 ఏళ్ళ వ్యక్తిగా కనిపించబోతున్నాడట. దీని కోసం వెరైటీగా మేకోవర్ అవుతున్నాడట బన్నీ.

అంతేకాదండోయ్.. ఇందులో అతడికి కొడుకు పాత్ర కూడా ఉంటుందట. దీని కోసం ఓ యంగ్ హీరోని ఎంపిక చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. మొదటి భాగం ఎండింగ్ లో పుష్పరాజ్ కు శ్రీవల్లితో పెళ్ళవుతుంది. రెండో భాగంలో స్మగ్లింగ్ సిండికేట్ కు కింగ్ అయిన పుష్పకు కొడుకు పుట్టి.. అతడు ఫ్యామిలీ మేన్ గా కూడా మారతాడట‌. తండ్రీ కొడుకుల మధ్య బాండింగ్ , ఎమోషన్స్ సినిమాకే హైలైట్ అవుతాయట. అయితే.. ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త నిజ‌మేనా..?  కాదా..? అనేది తెలియాల్సివుంది.

Also Read :  ‘పుష్ప 2’ సెట్స్ పైకి ఎప్పుడు? రిలీజ్ ఎప్పుడు? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్