Friday, March 20, 2026
Homeసినిమాఎన్టీఆర్ అభిమానుల మనసు దోచుకున్న బన్నీ

ఎన్టీఆర్ అభిమానుల మనసు దోచుకున్న బన్నీ

ఆర్ఆర్ఆర్ సినిమా అసలు ఊహించని ఆస్కార్ అవార్డ్ దక్కించుకోవడంతో ముఖ్యంగా తెలుగు సినీ అభిమానులు, సినీ ప్రముఖులు ఎంతో గర్వంగా ఫీలవుతున్నారు. అలాగే ఇండియాలోని సినీ ప్రముఖులు భారతదేశానికి గర్వకారణం అంటూ రాజమౌళి పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటి చెప్పింది అంటూ ప్రతి తెలుగువాడు ఆనందంగా, గర్వంగా ఫీలవుతున్నారు. తెలుగు సినీ హీరోలు రాజమౌళిని ఎంతగానో అభినందించారు. అయితే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఆర్ఆర్ఆర్ మూవీలోని ‘నాటు నాటు’ పాటకు అవార్డ్ రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

అయితే.. అల్లు అర్జున్ ట్వీట్ చూసి.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా హ్యీపగా ఫీలవుతున్నారు. ఇంకా చెప్పాలంటే.. ఎన్టీఆర్ అభిమానుల మనసు దోచుకున్నాడు బన్నీ. ఇంతకీ బన్నీ ఏమని ట్వీట్ చేశాడంటే.. ఇది భారతదేశానికి ఒక బిగ్ మూమెంట్ అంటూ తెలుగు సాంగ్ ఆస్కార్ వేడుకలో షేక్ చేయడం గొప్ప విషయం అని అన్నారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, లిరిసిస్ట్ చంద్రబోస్, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, సింగర్స్ కాలభైరవ – రాహుల్ సిప్లిగంజ్, హీరోలు ఎన్టీఆర్ – రామ్ చరణ్ లకు ప్రత్యేకంగా బన్నీ తన విశేస్ అందించాడు.

ఈ మ్యూజిక్ మూమెంట్ పాసిబుల్ కావడానికి ముఖ్య కారణమైనటువంటి రాజమౌళి పై కూడా ప్రశంసలు కురిపిస్తూ హార్ట్ టచింగ్ మూమెంట్ ఫర్ ఇండియా అంటూ బన్నీ తన సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు. అయితే.. చరణ్‌ ని మై లవ్లీ బ్రదర్ అని సంబోధించిన బన్నీ.. ఎన్టీఆర్ ని మాత్రం తెలుగుకి గర్వకారణమైన ఎన్టీఆర్ అని సంబోధించడం విశేషం. ఇది ఎన్టీఆర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈవిధంగా అల్లు అర్జున్ మరోసారి వార్తల్లో నిలిచాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular