Sunday, January 19, 2025
Homeసినిమా‘అఖండ’ ప్రీ రిలీజ్ కు అల్లు అర్జున్

‘అఖండ’ ప్రీ రిలీజ్ కు అల్లు అర్జున్

Allu Arjun for Balayya:
న‌ట‌సింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ ‘అఖండ’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నవంబర్ 27న హైద‌రాబాద్‌లోని శిల్పా కళా వేదికలో జరగబోతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. ఈ విషయాన్ని మేకర్లు ప్రకటించారు. బాలకృష్ణతో అల్లు అర్జున్‌కు మంచి సాన్నిహిత్యం ఉంది. అంతే కాకుండా బోయపాటి శ్రీనుతో అల్లు అర్జున్ ‘సరైనోడు’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు. అల్లు అర్జున్ భాగస్వామ్యంలో నడుస్తోన్న ‘ఆహా’ లో బాలయ్య హోస్ట్ గా ‘అన్ స్టాపబుల్’ షో అత్యంత ప్రేక్షకాదరనతో నడుస్తోన్న సంగతి కూడా తెలిసిందే.

అయితే.. అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అల్లు అర్జున్ గెస్ట్ గా వ‌స్తుండ‌డంతో ఈ ఈవెంట్ పై మ‌రింత ఆస‌క్తి ఏర్ప‌డింది. ద్వారకా క్రియేషన్స్ పై మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించారు. తమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలకు, ట్రైల‌ర్‌కు విశేషమైన స్పందన వచ్చింది. ఈ చిత్రం డిసెంబర్ 2న ప్ర‌పంచ‌ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : ‘అఖండ’ లాంటి సినిమా బోయపాటి వల్లే సాధ్యం : శ్రీకాంత్

RELATED ARTICLES

Most Popular

న్యూస్