Sunday, March 15, 2026
Homeసినిమాఅల్లు అర్జున్ జొమాటో యాడ్ కు అద్భుత స్పందన

అల్లు అర్జున్ జొమాటో యాడ్ కు అద్భుత స్పందన

Bunny-Zomato:  తెలుగు ఇండస్ట్రీలో అల్లు అర్జున్ కు ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే… ‘పుష్ప’తో ఆయన నేషనల్ వైడ్ గా ఇమేజ్ సంపాదించుకున్నారు. ఒక వైపు సినిమాలతో పాటు మరో వైపు కమర్షియల్ యాడ్స్ కూడా వరుసగా చేస్తున్నారు అల్లు అర్జున్. తాజాగా ఈయన జొమాటోకు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయ్యారు. దీనికి సంబంధించిన యాడ్ ఇప్పుడు ప్రసారం అవుతుంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుబ్బరాజు కూడా ఇందులో నటించారు. ‘అల వైకుంఠపురంలో’ యాక్షన్ సన్నివేశం తలపించేలా ఈ యాడ్ చిత్రీకరించారు. ఇందులో బన్నీ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ‘మనసు కోరితే తగ్గేదే లే..’ అంటూ పంచ్ లైన్ తో వచ్చారు అల్లు అర్జున్. కేవలం జొమాటో మాత్రమే కాదు ఆహా, రాపిడో, శ్రీ చైతన్య కాలేజీలకు కూడా బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు అల్లు అర్జున్.

Also Read : స‌రికొత్త రికార్డ్ సాధించిన‌ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular