Tuesday, September 17, 2024
Homeసినిమా'పుష్ప 2' విడుదల తేదీ ఖరారు అయ్యిందా..?

‘పుష్ప 2’ విడుదల తేదీ ఖరారు అయ్యిందా..?

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న మూవీ ‘పుష్ప 2’. ఇందులో అల్లు అర్జున్ కు జంటగా రష్మిక నటిస్తుంది. ఫాహిద్ ఫాజిల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. పుష్ప సినిమా సంచలన విజయం సాధించడంతో పుష్ప 2 సినిమా పై అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల పుష్ప 2 గ్లింప్స్ రిలీజ్ చేస్తే.. యూట్యూబ్ ని షేక్ చేసింది. చాలా తక్కువ టైమ్ లోనే 100 మిలియన్స్ కు పైగా వ్యూస్ సాధించింది. దీనిని బట్టి పుష్ప 2 పై ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

పుష్ప సినిమాకి గాను అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడుగా అవార్డ్ దక్కించుకోవడంతో పుష్ప 2 పై మరింత క్రేజ్ ఏర్పడింది. ఎవరు ఎన్ని అంచనాలు పెట్టుకున్నప్పటికీ అంతకు మించి అనేలా పుష్ప 2 ఉంటుందని సుకుమార్ ఓ సందర్భంలో చెప్పారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ఏమాత్రం రాజీపడకుండా మంచి క్వాలిటీతో నిర్మిస్తుంది. ఇక ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేయనున్నారంటే.. మార్చి 22న ఈ భారీ, క్రేజీ మూవీని రిలీజ్ చేసేందుకు డేట్ ఫిక్స్ చేశారని ప్రచారం జరుగుతుంది.

ప్రస్తుతం హైదరబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. త్వరలోనే రిలీజ్ డేట్ ను అఫిసియల్ గా అనౌన్స్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. పుష్ప సినిమాని ప్రమోషన్స్ చేయడానికి కూడా టైమ్ దొరకలేదు. హాడావిడిగా రిలీజ్ చేశారు. ఇప్పుడు అలా కాకుండా బాలీవుడ్ లో బాగా ప్రమోట్ చేయాలి అనుకుంటున్నారని తెలిసింది. మరి.. పుష్ప 2 ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్