Friday, March 20, 2026
Homeసినిమానవంబర్ 4న అల్లు శిరీష్ సినిమా విడుదల

నవంబర్ 4న అల్లు శిరీష్ సినిమా విడుదల

‘గౌరవం’ సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అల్లు శిరీష్ తక్కువ కాలంలోనే తనకంటూ మంచి గుర్తింపును సాధించుకున్నాడు. కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం లాంటి విభిన్నమైన కథలను ఎన్నుకుంటూ తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నాడు. శిరీష్ నుంచి చివరగా వచ్చిన “ఎబిసిడి” చిత్రం ఊహించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా, శిరీష్ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.

ఆ తరువాత ఇప్పటి వరకు శిరీష్ నుంచి సినిమాలు రాలేదు. ఇప్పుడు ఎట్టకేలకు శిరీష్ హీరోగా గీతా ఆర్ట్స్ లో చేసిన సినిమా రిలీజ్ కు సిద్ధమవుతోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు శిరీష్ చేసిన చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో వుంది. ఈ సినిమాను నవంబర్4న విడుదల చేయనున్నారు. ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్, ఫస్ట్ లుక్ టీజర్ ,త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. త్వరలోనే  ఈ మూవీ ప్రోమోషన్స్ ను మొదలుపెట్టనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular