Monday, March 16, 2026
Homeసినిమాకూతురితో కలిసి గణేష్ నిమజ్జనంలో బన్నీ

కూతురితో కలిసి గణేష్ నిమజ్జనంలో బన్నీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ప్ర‌తి సంవ‌త్స‌రం వినాయ‌క చ‌వితికి తన ఆఫీస్ లో వినాయకుడుని ప్రతిష్టించి పూజలు జరుపుతారు. గణేష్ చతుర్థి పండుగను తన టీమ్ తో ఘనంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం కూడా అలాగే గణేశుని ప్రతిమను ప్రతిష్టించారు. అల్లు అర్జున్ తన బృందంతో కలిసి గణేష్ నిమజ్జనంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇలా బ‌య‌ట‌కు వ‌చ్చిందో లేదో ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్ అయ్యింది.

పాన్ ఇండియా స్టార్ గా ఎనలేని గుర్తింపు సాధించుకున్న అల్లు అర్జున్, భారతీయ సంస్కృతిని మరిచిపోలేదు. నిమజ్జన వేడుకలు నిమిత్తం రోడ్డుపైకి రావడానికి వెనుకాడలేదు. తన కూతురిని పక్కన పెట్టుకుని స్వామికి వీడ్కోలు పలుకుతూ కొబ్బరికాయ పగలగొట్టాడు అల్లు అర్జున్. అలానే అర్హను ఊరేగింపులో భాగమవ్వాలని, నిమజ్జనాన్ని దగ్గరగా చూడమని.. పండుగ యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పి ప్రోత్సహించడం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular