Sunday, January 19, 2025
HomeTrending Newsప్రత్యామ్నాయ పంటలే మేలు – మంత్రి జగదీష్ రెడ్డి

ప్రత్యామ్నాయ పంటలే మేలు – మంత్రి జగదీష్ రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న రైతు వేదికలు రైతాంగానికి ఆధునిక దేవాలయాలని విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. విత్తనాల పంపిణీ నుండి పండించిన పంట మార్కెటింగ్ వరకు అనుభూతులు, అనుభవాలు పరస్పరం పంచుకునేందుకు రైతాంగానికి ఒక వేదిక అని ఆయన తెలిపారు. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాల గ్రామం నుండి మోత్కుర్ వరకు 9 కోట్ల అంచనా వ్యయం తో నిర్మించ తలపెట్టిన రహదారి నిర్మాణ పనులకు శుక్రవారం మంత్రి జగదీష్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అంతకు ముందు ఆయన అదే మండల పరిదిలోని ఖాజీరామరం, అనిశెట్టి దుప్పలపల్లి, తిప్పర్తి,మామిడాల,పజ్జుర్ గ్రామాలలో నిర్మించిన రైతు వేదికలతో పాటు తిప్పర్తిలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక సహకార సంఘ   కార్యాలయ భవనాన్ని మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు.

ఉమ్మడి రాష్ట్రంలో ఎంత పంట దిగుబడి అయిందో ప్రస్తుతం ఒక్క తెలంగాణ రాష్ట్రంలో అంతటి పంట దిగుబడి అయి ధాన్యం దిగుబడి లో యావత్ భారతదేశంలోనే మొదటి స్థానానికి చేరుకున్నామని జగదీష్ రెడ్డి వెల్లడించారు. అందులో ఉమ్మడి నల్లగొండ జిల్లా 19 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడితో సరికొత్త రికార్డ్ నమోదు చేసిందన్నారు. మొన్నటి యాసంగి లో రాష్ట్ర వ్యాప్తగా 90 లక్షల మెట్రిక్ టన్నుల పంట దిగుబడి అయితే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 19 లక్షల మెట్రిక్ టన్నులు పండిందన్నారు. అందులో ముందెన్నడూ లేని రీతిలో నల్లగొండ పరిధిలో 2 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి ఒక రికార్డే  నన్నారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం ఎక్కువ లబ్ది పొందింది ఉమ్మడి నల్లగొండ జిల్లాయోనని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.

24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ తో పాటు సాగుకు అవసరమైన నీరు సరిపడ ఇస్తున్నందున రైతాంగం ప్రత్యమ్నాయ పంటలపై దృష్టి సారించాలని మంత్రి జగదీష్ రెడ్డి సూచించారు. మూస పంటలకు స్వస్తి పలికి వాణిజ్య పంటల వైపు మొగ్గు చూపగలిగితే ఆర్థికంగా పరిపుష్టి సాధించవచ్చాన్నారు. ప్రపంచానికి అవసరమైన అన్ని రకాల పంటలు పండించేందుకు అనువైన భూములు ఒక్క తెలంగాణ రాష్ట్రములోనే ఉన్నాయన్న మంత్రి జగదీష్ రెడ్డి పత్తి,కంది,పెసర,వేరుశనగ లతో పాటు తోటల సాగువైపు రైతులు దృష్టి సారించాలన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్