Monday, February 24, 2025
HomeసినిమాAmala Paul: మళ్లీ పెళ్లి చేసుకోబోతున్న అమలాపాల్

Amala Paul: మళ్లీ పెళ్లి చేసుకోబోతున్న అమలాపాల్

అమలాపాల్ ‘మైనా’ అనే డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత అక్కినేని నాగచైతన్య నటించిన ‘బెజవాడ’ తో తెలుగు సినిమా చేసి అందం, అభినయంతో ఆకట్టుకుంది. వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంది. ‘ఇద్దరమ్మాయిలతో’ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు, ‘నాయక్’ లో చరణ్‌ కు జంటగా నటించింది. అనతి కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకుంది.

కెరీర్ పీక్స్ లో ఉండగానే డైరెక్టర్ విజయ్ ను లవ్ మ్యారేజ్ చేసుకుంది. అయితే.. 2014లో పెళ్లి చేసుకున్న విజయ్, అమలాపాల్ 2017లో విడిపోయారు. ఆ తర్వాత అమలాపాల్ సినిమాల్లో నటిస్తోంది కానీ చెప్పుకోదగ్గ సక్సెస్ రాలేదు. ఇప్పుడు అమలాపాల్ తన ఫ్రెండ్ జగత్ దేశాయ్ చేసిన మ్యారేజ్ ప్రపోజల్ కి ఓకే చెప్పింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు వీరిద్దరికి శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ వీడియోను ఇలా పోస్ట్ చేశారో లేదో అలా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రస్తుతం అమలాపాల్ ద్విజ అనే మలయాళ సినిమాలో నటిస్తుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్