Friday, September 20, 2024
HomeTrending NewsIT notices to Babu: సిబిఐకి అప్పగించాలి: డొక్కా డిమాండ్

IT notices to Babu: సిబిఐకి అప్పగించాలి: డొక్కా డిమాండ్

ఐటీ జారీ చేసిన నోటీసులపై చంద్రబాబు ఎందుకు నోరు విప్పరని మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ప్రశ్నించారు. ఆదాయ పన్ను శాఖ చట్ట ప్రకారమే పనిచేస్తుందని,  ఏ వ్యక్తి, సంస్థల ఆర్థిక లావాదేవీలు, వ్యాపారాల్లో తేడాలుంటే నోటీసులు ఇస్తారని…  2014-19లో రూ.118 కోట్లు మనీ ల్యాండరింగ్‌ ద్వారా చంద్రబాబుకు అందించామని మనోజ్ పార్థసాని చెప్పారని ఐటీ శాఖ నోటీసులు ఇస్తే దానిపై ఎందుకు మౌనంగా ఉన్నారని అడిగారు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు సమాధానం చెప్పాల్సిన నైతిక బాధ్యత చంద్రబాబుపై ఉందని, కేవలం ఐటీ శాఖకు లేఖలు రాశారే తప్ప ఆరోపణలను చంద్రబాబ ఖండించలేదని,  ముడుపులు తీసుకోలేదని ఎందుకు చెప్పలేకపోతున్నారని నిలదీశారు. తాడేపల్లి – వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

ఐటీ శాఖ షోకాజ్ నోటీసు ఇచ్చి సమాధానం అడిగిందని, సమాధానం ఆలస్యం అయితే వెంటనే చంద్రబాబును పిలిపించి కస్టడీలోకి తీసుకుని విచారణ చేయాలని డిమాండ్ చేశారు.

“కనీసం ఒక రింగ్‌ కూడా లేదని హరిశ్చంద్రుడిని అంటూ పదేపదే చెప్పుకునే బాబు ఇప్పుడు ఏం చెబుతారు? ఐటీ నోటీసులపై ప్రజల ముందుకు వచ్చి సమాధానం చెబితే.. మంచిది కదా. ప్రజాజీవితంలో ఉన్న మిగిలిన వారికి ఒక ట్రెండ్ సెట్‌ చేసిన వారు అవుతారు. పైగా నోటీసులు ఎవరు ఇవ్వాలో కూడా చంద్రబాబే చెబుతారా?” అని ఎద్దేవా చేశారు.

అమరావతిలో చంద్రబాబు చేసిన అవినీతిలో దొరికింది కొంతేనని, లోతుగా దర్యాప్తు చేస్తే వేల కోట్ల స్కాముల సంగతి తేలుతుందని అందుకే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరారు. తక్షణం విక్కీ జైన్, మనోజ్ పార్థసానిని కస్టడీలోకి తీసుకుని ప్రజాధనాన్ని ట్రెజరీకి అప్పజెప్పాలన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్