Wednesday, March 18, 2026
HomeసినిమాAmbajipet Marriage Band: ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Ambajipet Marriage Band: ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై తెరకెక్కుతోన్న సినిమా ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’. బ‌న్నీ వాసు, దర్శకుడు వెంకటేష్ మహా ఈ సినిమాను ప్రెజెంట్ చేస్తున్నారు.భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, 18 పేజెస్ లాంటి అద్భుతమైన చిత్రాల తర్వాత జిఏ 2 పిక్చర్స్ బ్యానర్లో వస్తున్న సినిమా “అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు”.

షార్ట్ ఫిల్మ్స్ తో కెరియర్ మొదలుపెట్టి ‘కలర్ ఫోటో’ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు సుహాస్. కేవలం యూత్ కి నచ్చే కాన్సెప్ట్స్ బేస్డ్ సినిమాలు మాత్రమే కాకుండా, రీసెంట్ గా ‘రైటర్ పద్మభూషణ్’ వంటి సినిమా చేసి ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా దగ్గరయ్యాడు సుహాస్. ప్రస్తుతం సుహాస్ హీరోగా చేస్తున్న ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’ మూవీ షూటింగ్ పనులను ముగించుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతుంది. జీఏ2 పిక్చ‌ర్స్, స్వేచ్ఛ క్రియేష‌న్స్, వెంక‌టేశ్ మ‌హా నిర్మాణంలో దుశ్యంత్ కటికనేని ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, ధీరజ్ మొగిలినేని ఈ సినిమాను నిర్మించారు.

మ్యారేజ్ బ్యాండ్ లో పని చేసే మల్లి అనే కుర్రాడిగా సుహాస్ ఈ సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ యూనిట్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.రిలీజ్ చేసిన పోస్టర్ లో మల్లికార్జున సెలూన్ షాప్ ను చూపిస్తూ, సెలూన్ షాప్ ముందు ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’ మెంబర్స్ ను రివీల్ చేసారు. సుహాస్ తో పాటు గోపరాజు రమణ, పుష్ప ఫేమ్ జగదీశ్ డప్పులు, సన్నాయి తో పాటు పలురకమైన మంగళవాయిద్యాలతో ఈ పోస్టర్ లో కనిపిస్తున్నారు. సినిమాకి సంబంధించిన మరిన్ని అప్ డేట్స్ ను త్వరలో అధికారికంగా ప్రకటించనుంది చిత్ర బృందం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular