Saturday, March 14, 2026
HomeTrending Newsబాబు పల్లకీ మోయడానికే ...: అంబటి

బాబు పల్లకీ మోయడానికే …: అంబటి

You are for Babu: జనసేన ముమ్మాటికీ చంద్రబాబు పల్లకీ మోయడానికే పుట్టిందని ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా కాపాడి ఎవరిని సిఎం చేయాలనుకుంటున్నారని పవన్ ను ప్రశ్నించారు. రెండు చోట్ల ఓడిపోయిన పవన్ ను చూసి మేమెందుకు భయపడతామని, పవన్ రాసి పెట్టుకోవాలని…. మళ్ళీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని అంబటి ధీమా వ్యక్తం చేశారు.  ‘నీ కోసం చొక్కాలు చించుకుంటున్న జనసైనికులు ప్రజల పల్లకీ మోయాలా, నీ పల్లకీ మోయాలా, చంద్రబాబు పల్లకీ మోయాలా, లేకపోతే లోకేష్ పల్లకీ మోయాలా అనేది స్పష్టంగా చెప్పాలని’ డిమాండ్ చేశారు.  నిన్న జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పవన్ చేసిన వ్యాఖ్యలపై అంబటి తీవ్రంగా విమర్శించారు.

రైతుల సమస్యలపై పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆవేదన చెందడం విడ్డూరంగా ఉందని అంబటి వ్యాఖ్యానించారు. 2014 ఎన్నికల్లో రైతు రుణమాఫీ పేరుతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు హామీకి విరుద్ధంగా కేవలం లక్ష రూపాయలు మాత్రమే మాఫీ చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. ఐదేళ్ళలో ఆ లక్ష రూపాయలను కూడా సరిగా మాఫీ చేయలేకపొతే అప్పుడు పవన్ ఎందుకు ప్రశ్నించలేకపోయారని అంబటి నిలదీశారు. బాబు హయాంలో పవన్ కు రైతులు గుర్తుకు రాకపోవడం శోచనీయమన్నారు.

రైతు భరోసా, రైతు భరోసా కేంద్రాలు, ఉచిత పంటల బీమా, ఇన్ పుట్ సబ్సిడీ లాంటి పథకాలతో రైతులను ఆదుకుంటున్న తమది రైతు ఫ్రెండ్లీ ప్రభుత్వమని వివరించారు.

Also Read : ప్రజలను పల్లకీ ఎక్కిస్తాం: పవన్ కళ్యాణ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular