Friday, February 21, 2025
HomeTrending Newsవైసీపీకి అంబటి రాయుడు గుడ్ బై

వైసీపీకి అంబటి రాయుడు గుడ్ బై

ఇటీవలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన క్రికెటర్ అంబటి రాయుడు రాజీనామా చేశారు. వైసీపీకి రాజీనామా చేస్తున్నానని, కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నానని, త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ వెల్లడిస్తానని ట్విట్టర్ ద్వారా అంబటి రాయుడు ప్రకటించారు.

గత ఐపీఎల్ సీజన్ ముగిసిన తరువాత క్రికెట్ కు గుడ్ బై చెప్పిన అంబటి రాయుడు పలుసార్లు సిఎం జగన్ తో సమావేశమయ్యారు. ఇటీవలే ప్రభుత్వం ప్రారంభించిన ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. గుంటూరు పార్లమెంట్ నుంచి అంబటి పోటీ చేస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో డిసెంబర్ 28న సిఎం జగన్ సమక్షంలో అధికారికంగా వైఎస్సార్సీపీలో చేరారు. పది రోజుల వ్యవధిలోనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు అంబటి ప్రకటించడం గమనార్హం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్