Wednesday, March 18, 2026
HomeTrending Newsగెటౌట్ చంద్రబాబు – షటప్ చంద్రబాబు: అంబటి

గెటౌట్ చంద్రబాబు – షటప్ చంద్రబాబు: అంబటి

slams babu: 2019 సాధారణ ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ ‘గెటౌట్‌ చంద్రబాబు… షటప్‌ చంద్రబాబు… బైబై బాబు’  అని ప్రజలు నిర్ద్వంద్వంగా ఎన్ని సార్లు చెప్పినా చంద్రబాబు నాయుడు సిగ్గు పడటం లేదని, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు నినాదం… క్విట్‌ జగన్, సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అని  మాట్లాడుతున్నారని,  కానీ ప్రజల విధానం ఏమిటో వారు ప్రతిసారీ చెబుతూనే ఉన్నారని వ్యాఖ్యానించారు.

ఏపీలో ప్రజా ఉద్యమం అవసరమని చంద్రబాబు మాట్లాడటం మరీ విడ్డూరమని, ఆ ఉద్యమం వచ్చింది కాబట్టే అయన ప్రతిపక్షంలో ఉన్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు గోలంతా దత్త పుత్రుడు– తాను ఇంతకు ముందు విడిపోయినట్టు ఆడిన డ్రామా ముగించటానికి మరో డ్రామా ఎలా ఆడాలా అన్నదేనని విమర్శించారు. డాక్టర్‌ వైయస్సార్‌ సమ కాలీకుడైన చంద్రబాబు… వైయస్సార్‌గారినీ ఒంటరిగా ఎదుర్కోలేకపోయాడని, అయన కుమారుడు జగన్ ను కూడా ఒంటరిగా ఎడుర్కొలేకపోయారని దుయ్యబట్టారు.

బాబు కంటే పెద్ద యాంటీ సోషల్ ఎలిమెంట్ ఎవరుంటారని అంబటి ప్రశ్నించారు. ఎన్ని కేసులు పెట్టించుకుంటే అంత గొప్పవారని టీడీపీ క్యాడర్ ను నేరుగా రెచ్చగొట్టటం వల్లే ఈ రోజు ఈ పసుపు ఆంబోతులు, మదం ఎక్కిన మృగాల్లా… రెచ్చిపోతున్నారని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.

అమ్మ ఒడి నాన్న బుడ్డికి సరిపోయిందంటూ బాబు మాట్లాడడం దగతని, తన హయంలో ఇలాంటి ఒక్క పథకం అయినా పెట్టటం చేతకాలేదని లెంపలు వేసుకోవాల్సిందని అన్నారు. నాన్న బుడ్డి అనే బదులు…  ‘లోకేశ్‌ నాన్న బుడ్డి’ అని చంద్రబాబు చెపితే బాగుంటుందన్నారు.  విశాఖను, ఉత్తరాంధ్రను దెబ్బతీసి… అమరావతిలో బినామీ భూముల రేట్ల కోసం చేసే కుట్రలకు, కుతంత్రాలకు చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అంబటి  హెచ్చరించారు.

Also Read : అప్పుడు బై బై బాబు, ఇప్పుడు ఫర్గెట్ బాబు: కాకాణి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular