Sunday, September 8, 2024
HomeTrending Newsఅంబేద్కర్ విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధం

అంబేద్కర్ విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధం

విజయవాడ  బెజవాడ స్వరాజ్‌ మైదానంలో నిర్మిస్తున్న అంబేడ్కర్‌ స్మృతి వనం పనులు తుది దశకు చేరుకున్నాయి. విజయవాడకే కాకుండా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికే తలమానికంగా నిలిచిపోయేలా ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 19న శుక్రవారం నాడు ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.  అంబేద్కర్ విగ్రహంతో పాటు ఆ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలను కూడా ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు.

ఢిల్లీ నుంచి వచ్చిన డిజైనర్లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులు చేస్తున్నారు.  విగ్రహం బేస్‌ కింది భాగంలో గ్రౌండ్‌, ఫస్ట్‌, సెకండ్‌ ఫ్లోర్‌లు ఉంటాయి. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో నాలుగు హాళ్లు ఉంటాయి. ఒక్కో హాలు 4,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఇందులో ఓ సినిమా హాలు, మిగిలిన మూడు హాళ్లలో ఆయన చరిత్ర తెలిపే డిజిటల్‌ మ్యూజియం ఉంటుంది.

ఫస్ట్‌ ఫోర్‌లో 2,250చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన నాలుగు హాళ్లు ఉంటాయి. ఒక హాలులో అంబేడ్కర్‌కు దక్షిణ భారత దేశంతో ఉన్న అనుబంధాన్ని డిస్‌ప్లే చేస్తారు.  సెకండ్‌ ఫ్లోర్‌లో 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు హాళ్లు ఉంటాయి.

125 అడుగుల ఈ విగ్రహం తయారీని షూ దగ్గర నుంచి బెల్ట్‌ వరకు హనుమాన్‌ జంక్షన్‌ వద్ద శిల్పి ప్రసాద్‌ ఆధ్వర్యంలో కాస్టింగ్‌ చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్