Tuesday, July 9, 2024
Homeసినిమా'అమిగోస్' సెన్సార్ రిపోర్ట్ ఏంటి..?

‘అమిగోస్’ సెన్సార్ రిపోర్ట్ ఏంటి..?

కళ్యాణ్‌ రామ్ ఇటీవల ‘బింబిసార’ మూవీతో బ్లాక్ బస్టర్ సాధించాడు. దీంతో కళ్యాణ్ రామ్ తాజా చిత్రం ‘అమిగోస్’ పై అందరిలో క్యూరియాసిటీ ఏర్పడింది. ఇందులో కళ్యాణ్ రామ్ సరసన కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథన్ నటించింది. నూతన దర్శకుడు రాజేంద్రరెడ్డి దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇటీవల ఈ సంస్థ నుంచి వచ్చిన వాల్తేరు వీరయ్య, ‘వీరసింహారెడ్డి’ వరుసగా సక్సెస్ సాధించడంతో అమిగోస్ మూవీతో హ్యాట్రిక్ సాధిస్తామని గట్టి నమ్మకంతో ఉన్నారు.

అమిగోస్ మూవీలో కళ్యాణ్‌ రామ్ త్రిపాత్రాభినయం చేయడం విశేషం. మూవీ ఈనెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. సెన్సార్ బోర్డ్ అమిగోస్ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ వచ్చింది. ఈ మూవీ నాన్ థియేట్రికల్ రైట్స్ ఇప్పటికే అమ్మేశారని తెలిసింది. వాటితో బడ్జెట్ రికవరీ అయ్యిందని సమాచారం. ఇటీవలే విడుదల అయిన ఈ సినిమా ట్రైలర్ లో ముగ్గురిలో ఒకరు ఇండియన్ పబ్ లో ఎస్కోబార్ అని ఇంట్రడ్యూస్ చేశారు. అతడిని పోలిన వ్యక్తులు మరో ఇద్దరు ఉంటారు. ఒకరి గాళ్ ఫ్రెండ్ అయితే.. ముగ్గుర్ని చూసి కన్ ఫ్యూజ్ అవుతుంది. ఆద్యంతం ట్రైలర్ ఇంట్రస్టింగ్ గా ఉండడంతో అమిగోస్ మూవీ పై బారీ అంచనాలు ఉన్నాయి.

ఇక సెన్సార్ రిపోర్ట్ ఏంటంటే.. మూవీ రన్ టైమ్ 139 నిమిషాలు. అంటే.. 2 గంటల 19 నిమిషాలు. ఇది సినిమాకు బాగా కలిసొస్తుంది అంటున్నారు. సినిమా బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా బోర్ అనేది లేకుండా చాలా ఇంట్రస్టింగ్ గా ఉందట. కళ్యాణ్‌ రామ్ మూడు విభిన్నమైన పాత్రల్లో చాలా చక్కగా నటించాడట. సినిమాకి వచ్చిన ఆడియన్ థ్రిల్ ఫీలవుతారు కానీ.. ఒక్క నిమిషం కూడా బోర్ ఫీలవరట. అంతలా ఇంట్రస్టింగ్ గా.. ఎంటర్ టైనింగ్ గా ఉందట. మొత్తానికి సెన్సార్ రిపోర్ట్ బాగానే ఉంది. మరి.. బాక్సాఫీస్ దగ్గర అమిగోస్ ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తుందో చూడాలి.

Also Read : ‘అమిగోస్’ బ్యూటీకి పెరుగుతున్న డిమాండ్! 

RELATED ARTICLES

Most Popular

న్యూస్