Friday, October 18, 2024
HomeTrending Newsకాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతి - అమిత్ షా

కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతి – అమిత్ షా

టీఆర్ఎస్‌ ప్రభుత్వంపై కేంద్రమంత్రి అమిత్ షా మండిపడ్డారు. కేసీఆర్‌ సర్కార్‌ను పడగొట్టేందుకు కోమరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరారని చెప్పారు. కేసీఆర్‌ సర్కార్‌ను పడగొట్టేందుకు ఇది ఆరంభమన్నారు. రాజగోపాల్‌రెడ్డిని గెలిపిస్తే..పొగ మాదిరిగా కేసీఆర్ ప్రభుత్వం మాయమైపోతుందని విమర్శించారు. సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తానని గతంలో కేసీఆర్ చెప్పారని.. అధికారంలోకి వచ్చాక విస్మరించారని ఫైర్ అయ్యారు.

వచ్చే ఎన్నికల్లో బీజేపీయే గెలుస్తుందన్నారు. రాజగోపాల్‌రెడ్డిని గెలిపిస్తే తెలంగాణ అభివృద్ధికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వం రాగానే దొడ్డు బియ్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు కేంద్రమంత్రి అమిత్ షా. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతి జరిగిందన్నారు. కేసీఆర్ కుటుంబసభ్యులకు కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ఏటీఎంలా మారిందని మండిపడ్డారు. కేసీఆర్‌ది కుటుంబ పాలన అని అన్నారు. అధికారంలోకి రాగానే విమోచన దినోత్సవాన్ని జరుపుతామని స్పష్టం చేశారు.

మునుగోడులో బీజేపీ సమర భేరీని ఏర్పాటు చేసింది. సభ ద్వారా సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆ పార్టీలో చేరారు. కేంద్రమంత్రి అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకే బీజేపీలో చేరానని స్పష్టం చేశారు. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని గద్దె దించుతామన్నారు. కేసీఆర్ ఇచ్చే బీబీసీ తీసుకుని మోస పోవద్దని మరో నేత విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీబీసీ అంటే బిర్యానీ, బ్రాందీ, కరెన్సీ అని చెప్పారు. 8 ఏళ్ల పాలనలో టీఆర్ఎస్‌ చేసిందేమి లేదని ఫైర్ అయ్యారు. పేదలకు ఇస్తామన్న డబుల్ బెడ్‌ రూమ్ ఇళ్ల ఏవి అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతి జరిగిందని ఆరోపించారు. ఐటీ, సీబీఐ, ఈడీ వచ్చినా భయపడేది లేదన్నారు. ఈసందర్భంగా కేసీఆర్ పాలనపై పలువురు బీజేపీ నేతలు మండిపడ్డారు. త్వరలో భారీగా చేరికలు ఉండబోతున్నాయని తెలిపారు.

త్వరలో మునుగోడులో ఉప ఎన్నిక జరగనుంది. దీంతో రాజకీయాలు హీటెక్కాయి. రాజకీయ పార్టీలు వరుసగా భారీ బహిరంగ సభలను నిర్వహిస్తున్నాయి. TRS నిన్న భారీ బహిరంగ సభ నిర్వహించగా..ఇవాళ బీజేపీ చేపట్టింది. ఇటీవల కాంగ్రెస్‌, మునుగోడు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారు. దీంతో మునుగోడు స్థానానికి ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. ఈఏడాది డిసెంబర్‌లో మునుగోడులో ఉప ఎన్నిక జరగనుంది.

Also Read : తెలుగు సినిమా తారక రత్నాన్ని కలిశా: అమిత్ షా ట్వీట్

RELATED ARTICLES

Most Popular

న్యూస్