భారతీయ జనతాపార్టీ మత రాజకీయాలు చేసి రాష్ట్రంలో బలం పెంచుకోవాలని చూస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా ఆరోపించారు. టిప్పుసుల్తాన్ గొప్పదనాన్ని డా. అంబేద్కర్ సైతం రాజ్యాంగంలో ప్రశంసించారని, అలాంటి వ్యక్తి విగ్రహ ఏర్పాటుపై ఆందోళనలు చేస్తూ రెచ్చగొట్టాలని బిజెపి యత్నిస్తోందని…. సున్నితమైన అంశాలను వాడుకుంటూ బలపడేందుకు ప్రయత్నించడం శోచనీయమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచి లబ్ధిపొందాలని చూస్తోందన్నారు. ప్రభుత్వం అనుమతిస్తేనే విగ్రహం ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే రాచమల్లు చెప్పారని, ఈ విషయంపై అనవసర రాద్దాంతం తగదని సూచించారు. ముస్లింలకు సిఎం జగన్ పాలన స్వర్ణయుగం లాంటిదని, అయన పాలన దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని డిప్యూటీ ముఖ్యమంత్రి కొనియాడారు.
రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక విధానం ఉంటుందని, దాని ప్రకారమే పని చేస్తాయని, ఆర్ధిక వ్యవహారాలూ కూడా దానిలో భాగమేనని అంజాద్ వెల్లడించారు. విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవడంలో కేంద్రం ఉదారంగా వ్యవహరించాల్సి ఉంటుందని, పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన విధులు విడుదల చేయాలని విజ్ఞప్తి సెహ్షారు. రాష్ట్రాలకు కేంద్రం సహకరించాలని సూచించారు.