Tuesday, February 25, 2025
HomeTrending Newsజగన్ పై రాయి విసిరిన దుండగుడు - ఎడమ కంటిపై గాయం

జగన్ పై రాయి విసిరిన దుండగుడు – ఎడమ కంటిపై గాయం

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మేమంతా సిద్ధం యాత్రపై ఓ  దుండగుడు రాయి విసిరాడు. ఆ రాయి నేరుగా జగన్ ఎడమ కంటిపై తాకడంతో గాయమైంది.   నగరంలోని సింగ్ నగర్ గంగానమ్మ గుడి వద్ద  బస్సుపై నుంచి జగన్ అభివాదం చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. జగన్ తో పాటు ఆయన పక్కనే ఉన్న మాజీ మంత్రి, సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్ధి వెల్లంపల్లి శ్రీనివాస్  కంటికి కూడా గాయమైంది.

ఈ హఠాత్ పరిణామంతో భద్రతా సిబ్బంది అవ్వక్కయ్యారు. వెంటనే తేరుకొని సిఎం ను బస్సులోకి తీసుకు వెళ్ళారు. ముఖ్యమంత్రి సహాయ నిధి వ్యవహారాలు పర్యవేక్షించే డా. హరికృష్ణ ప్రాథమిక చికిత్స చేశారు. కొద్దిసేపు విరామం అనంతరం జగన్ తన యాత్రను కొనసాగిస్తున్నారు

RELATED ARTICLES

Most Popular

న్యూస్