Tuesday, March 17, 2026
Homeసినిమాఆనంద్ దేవ‌ర‌కొండ‌ “గం..గం..గణేశా” ప్రారంభం

ఆనంద్ దేవ‌ర‌కొండ‌ “గం..గం..గణేశా” ప్రారంభం

Ganeshaa! ‘దొరసాని’, ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’, ‘పుష్పక విమానం’ చిత్రాలతో టాలెంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు  ఆనంద్ దేవరకొండ. సహజత్వానికి దగ్గరగా ఉండే కథలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేకత ఏర్ప‌రచుకున్నారు. ఈసారి కూడా ఆనంద్ కొత్త ప్రయత్నం చేయబోతున్నారు. తన తాజా సినిమా “గం..గం..గణేశా”ను లాంచ్ చేశారు. హై-లైఫ్ ఎంటర్టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

ఈ సినిమా పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది. నిర్మాతలు కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి దర్శకుడు ఉదయ్ శెట్టికి స్క్రిప్ట్ అందించారు. తాజాగా విడుదల చేసిన “గం..గం..గణేశా” సినిమా టైటిల్ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. ‘యాక్షన్ ఫెస్టివల్ బిగిన్స్’ అని పోస్టర్ మీద రాయడం, టైటిల్స్ లో గన్స్ డిజైన్ చేయడం చూస్తుంటే ఇదొక యాక్షన్ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది. ఆనంద్ ఇప్పటిదాకా చేయని యాక్షన్ జానర్ ను ఈ చిత్రంతో టచ్ చేయబోతున్నారు. చేతన్ భరద్వాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. నాయికతో పాటు ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

ఇవి కూడా చదవండి: సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ ‘దారి’ కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular