కృష్ణపట్నం ఆనందయ్య తయారుచేసే మందు హానికరం కాదని రాష్ట్ర అయుష్ కమిషనర్ రాములు స్పష్టం చేశారు. ఇది కరోనా కోసం తయారు చేసిన మందు కాదని, కానీ కోవిడ్ బాధితులకు కొంత ఉపశమనం ఇస్తుందని వెల్లడించారు. ఈ మందు తయారీలో ఆయుర్వేద ప్రోటోకాల్స్ లేవని, త్వరలోనే ఈ మందుపై ప్రభుత్వానికి సమగ్ర ఇస్తామని చెప్పారు.
ఆనందయ్య వాడే పదార్ధాలు వంటింటి ఔషధాలు, ప్రకృతి వనమూలికలేనని రాములు వివరించారు. ప్రజలు ఆసక్తి చూపుతున్నందున మందు తయారీని ఉన్నతాధికారుల అనుమతి తీసుకుని యూట్యూబ్ ద్వారా అందుబాటులోకి తెస్తామని చెప్పారు. అయితే ఐసిఎంఆర్ నివేదిక, అయిర్వేద డాక్టర్ల నివేదిక వచ్చిన తరువాతనే పంపిణీపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
మరోవైపు కళ్ళలో వేస్తున్న చుక్కల మందుపై కంటి వైద్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.