Saturday, March 14, 2026
Homeసినిమాఅతకని పాత్రలో అనసూయ!

అతకని పాత్రలో అనసూయ!

అనసూయకి ఒక స్టార్ హీరోయిన్ కి ఉండవలసిన ఫాలోయింగ్ ఉంది. అందుకు కారణం ఆమె గ్లామర్. ఇక నటన విషయంలోను అనసూయకి వంకబెట్టడానికి లేదు. గ్లామరస్ గా కనిపించే పాత్రలలోను .. నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలలోను ఆమె తనని తాను నిరూపించుకుంది. మాస్ లుక్ తో .. యాసతో ఆడియన్స్ ను తనవైపుకు తిప్పుకోవడం కూడా తనకి బాగా తెలుసు. అనసూయ ఒక పాత్రను చేస్తుందంటే, కచ్చితంగా ఆ సినిమాకి అదో ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుంది.

అనసూయ నటించిన సినిమాలలో ‘రంగస్థలం’ .. ‘పుష్ప’ .. ‘రంగమార్తాండ’ వంటివి ఆమెకి మంచి పేరును తీసుకొచ్చాయి. ఇవి అనసూయకి మాత్రమే సెట్ అవుతాయి .. ఆమె మాత్రమే చేయగలదు అనుకున్నారు. ఆ పాత్రలకి ఆమె తీసుకొచ్చిన సహజత్వం వలన, ఆమె డిమాండ్ మరింత పెరిగిపోయింది. ఈ మధ్య కాలంలో చాలా ప్రాజెక్టులలో ఆమె పేరు వినిపిస్తోంది. ఆమె నుంచి రీసెంట్ గా వచ్చిన సినిమాగా ‘విమానం’ కనిపిస్తుంది. ఈ సినిమాలో సుమతి అనే వేశ్య పాత్రలో అనసూయ కనిపించింది.

ఈ సినిమా ప్రమోషన్స్ మొదలైన దగ్గర నుంచి కూడా సుమతి పాత్రలో అనసూయను హైలైట్ చేస్తూ వెళ్లారు. దాంతో జనంలో సహజంగానే ఆసక్తి పెరిగింది. అయితే కథ నేపథ్యానికి .. కథ నడిచే ప్రదేశానికి అనసూయ పాత్ర అతకలేదనే టాక్ వచ్చింది. పాత్రకి మించిన గ్లామర్ తో ఆమె కనిపించడమే అందుకు కారణం అంటున్నారు. ఇక సరైన ఫిట్ నెస్ తో కూడా ఆమెను చూపించలేకపోయారు. ఇంతవరకూ ఆమెకి పేరు తీసుకొచ్చిన పాత్రల సరసన సుమతి కూడా చేరుతుందనుకున్న అభిమానులకు నిరాశే ఎదురైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular