ప్రతిష్ఠాత్మక కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్లో ఉత్తమ నటి అవార్డు భారతీయ నటి అనసూయ సేన్ గుప్తా గెల్చుకున్నారు. ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయ నటిగా ఆమె చరిత్ర సృష్టించారు. ‘షేమ్ లెస్’ చిత్రంలో రేణుక పాత్రలో నటనకు గాను ఈ అవార్డు ఆమెను వరించింది. ట్రాన్స్ జెండర్లు, ఇతర అణగారిన వర్గాల వారికి ఈ అవార్డును అనసూయ అంకితం చేశారు.
కాగా 2009లో మ్యాడ్లీ బంగాలీ అనే చిత్రంలో సహాయనటిగా చేసిన అనసూయ ఆ తర్వాత ప్రొడక్షన్ డిజైనర్ గా అనేక చిత్రాలకు పనిచేశారు.