Sunday, March 15, 2026
Homeసినిమా‘పక్కా కమర్షియల్’ నుంచి అందాల రాశీ సాంగ్ టీజర్ విడుదల

‘పక్కా కమర్షియల్’ నుంచి అందాల రాశీ సాంగ్ టీజర్ విడుదల

Andala Rasi: యాక్ష‌న్ హీరో గోపీచంద్, ద‌ర్శ‌కుడు మారుతి కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ చిత్రం పక్కా కమర్షియల్. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో స‌క్సెస్ ఫుల్ బ్యాన‌ర్లుగా అంద‌రి మ‌న్న‌న‌లు అందుకుంటూ మందుకు సాగ‌తున్న జీఏ 2 పిక్చ‌ర్స్ – యూవీ క్రియేష‌న్స్ క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ టైటిల్ కు అటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల నుంచి ఇటు సాధ‌ర‌ణ ప్రేక్షకుల వ‌రకు అంతటా అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించ‌డం విశేషం.

ఇప్పటికే విడుదలైన పక్కా కమర్షియల్ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన టైటిల్ సాంగ్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జులై 1, 2022న పక్కా కమర్షియల్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలోని అందాల రాశీ పాట జూన్ 1న విడుదల కానుంది. తాజాగా ఈ పాట‌కు సంబంధించిన టీజ‌ర్ విడుదలై, ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ సినిమాలో గోపీచంద్ క్యారెక్టర్‌ను మారుతి అద్భుతంగా డిజైన్ చేశారు.

కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. భలే భలే మగాడివోయ్, టాక్సీవాలా, ప్రతి రోజు పండగే లాంటి విజయాలతో అపజయమే లేని జీఏ2 పిక్చ‌ర్స్ – యూవీ క్రియేష‌న్స్ – బ‌న్నీవాసు – కాంబినేష‌న్ లో పక్కా కమర్షియల్ సినిమా వస్తుంది. మ‌రి.. ఈ సినిమాతో గోపీచంద్ ఆశించిన సక్సెస్ సాధిస్తారో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular