Saturday, January 18, 2025
HomeTrending NewsAP Assembly: ఒక తీర్మానం, 10 బిల్లులకు అసెంబ్లీ ఆమోదం

AP Assembly: ఒక తీర్మానం, 10 బిల్లులకు అసెంబ్లీ ఆమోదం

రెండ్రోజుల విరామం తరువాత నేడు సమావేశమైన ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ పలు బిల్లులకు ఆమోదం తెలిపింది.  స్పీకర్ తమ్మినేని సీతారాం తొలుత ప్రశ్నోత్తరాలు చేపట్టారు. తెలుగుదేశం సభ్యులు ఈ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. దీనితో సభ సజావుగా జరిగింది. ప్రశ్నోత్తరాల తర్వాత సభను కాసేపు వాయిదా వేశారు.

తిరిగి సమావేశం కాగానే తొలుత బుడగ. బైర జంగాలను ఎస్టీ జాబితాల్లో చేర్చాలంటూ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి మేరుగ నాగార్జున అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టగా  సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.

దీనితో పాటుగా

  1. ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ రోడ్ కార్పొరేషన్ అబ్జార్షన్ అఫ్ ఎంప్లాయిస్ ఇన్ టూ గవర్నమెంట్ సర్వీస్ అమెండ్మెంట్ బిల్-2023
  2. ఆంధ్ర ప్రదేశ్ మోటార్ వెహికల్ టాక్సెస్ అమెండ్మెంట్ బిల్-2023
  3. ఆంధ్ర ప్రదేశ్ మోటార్ వెహికల్ టాక్సెస్ 2వ అమెండ్మెంట్ బిల్-2023
  4. ఆంధ్ర ప్రదేశ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్ మెంట్ అమెండ్మెంట్ బిల్-2023
  5. ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్  ఎంట్రస్ట్ మెంట్  అఫ్ అడిషనల్ ఫంక్షన్స్ విత్ రెస్పెక్ట్ టూ ద సర్వీసెస్ అఫ్  యూనివర్సిటీస్ అమెండ్మెంట్ బిల్-2023
  6. ఆంధ్ర ప్రదేశ్ ‘గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ సవరణ బిల్లు-2023
  7. ఆంధ్ర ప్రదేశ్ రెగ్యులేషన్ అఫ్ అప్పాయింట్మెంట్స్ టూ పబ్లిక్ సర్వీసెస్ అండ్ రేషనలైజేషన్  అఫ్ స్టాఫ్ పాట్రన్ అండ్ ప్లే స్ట్రక్చర్ అమెండ్మెంట్ బిల్-2023
  8. ఆంధ్ర ప్రదేశ్ అసైన్డ్ ల్యాండ్స్ ప్రొహిబిషన్ అఫ్ ట్రాన్స్ ఫర్స్ సవరణ బిల్లు-2023
  9. ఆంధ్రప్రదేశ్ భూదాన్ అండ్ గ్రామ దాన్ సవరణ బిల్లు-2023
  10. ఆంధ్ర ప్రదేశ్ ఛారిటబుల్ అండ్ హిందూ రెలిజియస్ ఇన్ స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ సవరణ బిల్లు-2023 లను అసెంబ్లీ ఆమోదించింది.
RELATED ARTICLES

Most Popular

న్యూస్