Sunday, January 19, 2025
HomeసినిమాAneethi: ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో వచ్చిన 'అనీతి'

Aneethi: ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో వచ్చిన ‘అనీతి’

ఇంతవరకూ దర్శకుడిగా వసంతబాలన్ తెరకెక్కించిన సినిమాలు తక్కువే అయినా, ఆయన సినిమాలు వైవిధ్యభరితంగా ఉంటాయనే ఒక పేరు వచ్చింది. ఆయన సినిమాల్లో సూపర్ స్టార్స్ లేకపోయినా, అవి అవార్డులను గెలుచుకున్నాయి. ఆ సినిమాలను గురించి జనాలు మాట్లాడుకునేలా చేశాయి. అలాంటి వసంతబాలన్ నుంచి ఇటీవల వచ్చిన మరో సినిమానే ‘అనీతి’. జులైలో థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, రీసెంట్ గా తెలుగు వెర్షన్ తో అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చింది.

ఇంతవరకూ విలన్ రోల్స్ చేస్తూ వచ్చిన అర్జున్ దాస్ ను, హీరోగా ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చాడు. దుషరా విజయన్ ఈ సినిమాలో కథానాయికగా నటించింది. ఈ కథను ఆయన తయారు చేసుకున్న తీరు .. ఆ కథను నడిపించిన విధానం చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. తన జీవితంలో చిన్నతనంలో జరిగిన ఒక సంఘటన కారణంగా హీరో మానసిక స్థితి దెబ్బతింటుంది. దాంతో ఎవరు ఇరిటేట్ చేసినా వాళ్లను చంపడానికి వెనుకాడని విధంగా మారిపోతాడు.

ఇక హీరోయిన్ ఒక ధనిక కుటుంబంలో పనిమనిషిగా పనిచేస్తూ ఉంటుంది. ఫుడ్ డెలివరీ బాయ్ గా చేసే హీరోతో ఆమె ప్రేమలో పడుతుంది. ఆమె ఇంటి యజమాని ఆ ఇంట్లో ఒక్కతే ఉంటూ ఉంటుంది. ఆమె పిల్లలంతా ఫారిన్ లో ఉంటారు. తన ఇంట్లో డెలివరీ బాయ్ – పనిమనిషి సీక్రెట్ గా కలుసుకోవడం చూసిన ఆమె వాళ్లపై మండిపడుతుంది. ఆ రాత్రి ఆ ఇంటి యజమాని చనిపోతుంది. అది హత్యనా? .. ఆత్మ హత్యనా? అనే ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంటుంది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా నడిచే ఈ క్రైమ్ థ్రిల్లర్ యూత్ కి కనెక్ట్ అవుతుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్