Saturday, February 22, 2025
HomeTrending Newsమా క్రెడిట్ మీ ఖాతాలోనా? లోకేష్ ప్రశ్న

మా క్రెడిట్ మీ ఖాతాలోనా? లోకేష్ ప్రశ్న

Its a lie: చంద్రబాబు ప్రభుత్వం2018లో  అంగన్ వాడీ టీచర్లకు జీతాలు పెంచితే అది తానే చేశానని  సిఎం జగన్ చెప్పుకోవడం హాస్యాస్పదమని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ విమర్శించారు. ఈ మేరకు అయన ట్వీట్  చేశారు.

“అబద్ధానికి ఫ్యాంటు, షర్టు వేస్తే అచ్చం ys jagan గారిలానే ఉంటుంది. నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతూ, మోసం చెయ్యడం ఆయన నైజం. 2018లోనే అంగన్వాడీ టీచర్లు, ఆయాల జీతాలు పెంచింది అప్పటి ముఖ్యమంత్రి Chandra babu Naidu గారు రూ.7500 ఉన్న అంగన్వాడీ టీచర్ల జీతాన్ని రూ.10,500కు పెంచారు. ఆయాల జీతాన్ని రూ.4500 నుండి రూ.6000కు పెంచారు. టీడీపీ ఘనతని మీ ఖాతాలో వేసుకునే ప్రయత్నాలు మాని, నమ్మి ఓటేసిన వారికి ఇచ్చిన హామీలు అమలు చేసే పని మొదలు పెట్టండి సీఎం గారు.” అంటూ లోకేష్ ట్వీట్ లో సూచించారు.

ఇవి కూడా చదవండి: ఉద్యోగులు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు: అశోక్ బాబు

RELATED ARTICLES

Most Popular

న్యూస్