Sunday, November 24, 2024
HomeTrending Newsఅంగన్‌వాడీల డిమాండ్లకు ప్రభుత్వం ఓకే

అంగన్‌వాడీల డిమాండ్లకు ప్రభుత్వం ఓకే

అంగన్‌వాడీ వర్కర్లు, సహాయకుల సేవల విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే అంగన్‌వాడీ వర్కర్లకు, సహాయకులను వర్కర్లుగా ప్రమోట్‌చేసే వయోపరిమితి 45 ఏళ్లనుంచి 50 ఏళ్లకు పెంచేందుకు ప్రభుత్వం అంగీకరించింది.  అలాగే అంగన్‌వాడీ వర్కర్లు, మినీ వర్కర్ల సర్వీసు విరమణ తర్వాత ఒన్‌టైం బెనిఫిక్‌ రూ.50 వేల నుంచి రూ. 1 లక్షకు…సహాయకుల సర్వీసు విమరమణ తర్వాత ఒన్‌టైం బెనిఫిట్‌ రూ.40వేలకు పెంచింది.

అంగన్‌వాడీ వర్కర్లు నెలకు ఒకసారి, హెల్పర్లు రెండు నెలలకు ఒకసారి TA/DA క్లెయిమ్ చేసుకునేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది.  గ్రామీణ/గిరిజన ప్రాంతాలలో ఉన్న 16575 అద్దె భవనాలకు, పట్టణ సముదాయములో ఉన్న 6705 అద్దె భవనాలకు Rs.66.54 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది.

అంగన్వాడి కేంద్రాలకు అవసరమైన చీపురులు, బకెట్లు, మగ్గులు, ఫినాయిల్, సబ్బులు, స్టేషనరీ లాంటి అవసరాలను తీర్చడానికి 48,770 మెయిన్ అంగన్వాడి సెంటర్స్ కు Rs.500 చొప్పున, 6837 మినీ అంగన్వాడి సెంటర్స్ కు Rs.250/ చొప్పున మంజూరు చేయనుంది.  సొంత భవనాల నిర్వహణ- గోడల పెయింటింగ్ లు, చిన్నపాటి మరమ్మత్తుల క్రింద 21206 అంగన్వాడి సెంటర్స్ కు (ఒకొక్క కేంద్రానికి Rs.3000/- రూపాయల చొప్పున) Rs.6.36 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది. అంగన్ వాడీలు వెంటనే ఆందోళన విరమించి విధులకు హాజరు కావాలని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి ఉషశ్రీ చరణ్ విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్