Monday, March 16, 2026
HomeసినిమాAkhil with Anil: అఖిల్ తదుపరి చిత్రం ఎవరితో..?

Akhil with Anil: అఖిల్ తదుపరి చిత్రం ఎవరితో..?

అఖిల్ నటించిన ‘ఏజెంట్’ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ప్రమోషన్స్ చాలా ఆలస్యంగా ప్రారంభించారు కానీ.. చాలా స్పీడుగా బజ్ క్రియేట్ అయ్యేలా చేశారు. ఈ సినిమా కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడు. తన కష్టాన్ని చూసిన ఇండస్ట్రీ జనాలే కాదు.. సినీ అభిమానులు అందరూ ఏజెంట్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు. అలాగే ఏజెంట్ టీమ్ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్ముతున్నారు. ఈ మూవీకి వచ్చిన క్రేజ్ చూసిన తర్వాత అఖిల్ తదుపరి చిత్రం ఎవరితో..? ఎప్పుడు..? అనేది ఆసక్తిగా మారింది.

అయితే తాజా సమాచారం ప్రకారం.. అఖిల్ నెక్ట్స్ మూవీని యువీ క్రియేషన్స్ లో ఉంటుందని, అనిల్ అనే యువకుడు దర్శకుడిగా పరిచయం అవుతున్నారనే టాక్ వినిపిస్తుంది. రన్ రాజా రన్, సాహో చిత్రాలకు యూవీ సంస్థలో అనిల్ పని చేశారు. . ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందట. ఏజెంట్ మూవీ రిలీజైన వెంటనే దీన్డీని అనౌన్స్ చేయనున్నారని ప్రచారం జరుగుతుంది. అలాగే ఏజెంట్ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అనిల్ సుంకర బ్యానర్ లో కూడా అఖిల్ మరో సినిమా చేయనున్నారు.

కెరీర్ బిగినింగ్ నుంచి చాలా ఫాస్ట్ గా సినిమాలు చేయాల్సిన అఖిల్ ఇప్పటి వరకు చాలా స్లోగా సినిమాలు చేశారు. అయితే… ఇక నుంచి మాత్రం చాలా స్పీడుగా సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యారట. యువీ క్రియేషన్స్ బ్యానర్ లో మూవీ, మళ్లీ అనిల్ సుంకరతో మూవీనే కాకుండా ఇంకా కొన్ని కథలను ఫైనల్ చేశారని సమాచారం. అభిమానులు కోరుకుంటున్నట్టుగా వరుసగా భారీ, క్రేజీ సినిమాలు చేసేందుకు పక్కా ప్లాన్ రెడీ చేశారని తెలిసింది. ఏజెంట్ మూవీ రిలీజైన తర్వాత అఖిల్ కు మరింత క్రేజ్ రావడం ఖాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular