Saturday, January 18, 2025
Homeసినిమాఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి అనిల్ రావిపూడి

ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి అనిల్ రావిపూడి

‘పటాస్’ సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి.. తొలి ప్రయత్నంలోనే సక్సెస్ సాధించిన అనిల్ రావిపూడి. ఆతర్వాత ‘సుప్రీమ్’, ‘రాజా ది గ్రేట్’, ‘ఎఫ్‌ 2’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘ఎఫ్ 3’.. ఇలా వరుసగా సక్సెస్ సాధిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నారు. ప్రస్తుతం బాలకృష్ణతో ఓ భారీ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రానికి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. డిసెంబర్ 8న ఈ చిత్రాన్ని ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో బాలయ్యను సరికొత్తగా చూపించనున్నారు. నలభై ఏళ్ల వయసున్న వ్యక్తిగా బాలయ్య కనిపించనున్నారు.

బాలయ్య కూతురుగా శ్రీలీల నటిస్తుంటే.. కథానాయికగా సోనాక్షి సిన్హా నటించనున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు వచ్చిన బాలయ్య చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుందని.. అలాగే బాలయ్య నుంచి అభిమానులు కోరుకునే అంశాలు కూడా ఉంటాయని చెప్పారు. దీంతో అసలు ఈ సినిమా కథ ఏంటి..? ఈ సినిమాతో ఏం చెప్పనున్నారు..? అనేది ఆసక్తిగా మారింది. అయితే.. ఇటీవల ఇచ్చిన ఇంటర్ వ్యూలో అనిల్ రావిపూడి పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. ఇంతకీ ఏం చెప్పారంటే… తనకు భక్తి చిత్రం చేయాలనే ఆలోచన కూడా ఉందన్నారు.

ఇప్పుడు ఎక్కడ చూసినా డివోషనల్ ట్రెండ్ మొదలైనట్టుగా అనిపిస్తోంది.’అఖండ’, ‘కార్తికేయ 2’, ‘ఆది పురుష్’, ‘హనుమాన్’.. ఇలా వరుసగా డివోషనల్ టచ్ తో కూడిన సినిమాలు వస్తున్నాయి. నాకు కూడా ఆ తరహా సినిమాలు చేయాలని ఉంది. అయితే అందుకు రెండుమూడేళ్లు పట్టొచ్చని అనుకుంటున్నాను అన్నారు. ఇక పవన్ కళ్యాణ్ తో సినిమా గురించి స్పందిస్తూ… ఆయనతో సినిమా చేయాలనుకున్నాను కానీ.. కుదరలేదు. ప్రస్తుతం కళ్యాణ్ గారు రాజకీయాల్లోనూ, సినిమాల్లోనూ బిజీగా ఉన్నారు. తప్పకుండా పవర్ స్టార్ తో సినిమా చేయాలని వుంది. ఎప్పుడు కుదురుతుందో చూడాలి. అలాగే మహేష్‌ బాబు ఎప్పుడు రెడీ అంటే అప్పుడు సినిమా చేయడానికి రెడీగా ఉన్నానని అనిల్ రావిపూడి చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్